ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీలకు ప్రభుత్వం వెన్నుదన్ను

ABN, Publish Date - Aug 23 , 2024 | 02:26 AM

పల్లెలకు కాసుల కళ వచ్చింది. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను తాజాగా పంచాయతీ ఖాతాలకు జమ చేశారు. ఈ మేరకు జిల్లాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.24 కోట్లు జనాభా ప్రాతిపదికన విడుదలయ్యాయి. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో పంచాయతీలకు నిధులొచ్చాయి.

15వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.24 కోట్లు విడుదల

మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 22 : పల్లెలే దేశప్రగతికి పట్టుకొమ్మలన్న జాతిపిత మాటలను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. వీటికి సమాంతరంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను లాక్కొని విద్యుత్‌ బకాయిలకు చెల్లించినట్లు నోటిమాట ద్వారా చెప్పింది. పంచాయతీలకు ఎక్కడ ఎంత విద్యుత్‌ బకాయిలకు నిధులు జమచేశారో తెలియడం లేదు. అందుకు రశీదులు కూడా ఇవ్వలేదు. ఆ నిధులు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదు. ఇలా నిధులను దారి మళ్లించడంతో గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేని స్థితికి సర్పంచులు చేరారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఆ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు కాగానే పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. పంచాయతీల రూపురేఖలు మార్చేదిశగా ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కసరత్తు చేపట్టారు. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను తాజాగా పంచాయతీ ఖాతాలకు జమచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం జిల్లాకు రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.24 కోట్లు వచ్చాయి.

గత ఐదేళ్లలో ఇలా..

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్పంచులు, పంచాయతీల ప్రమేయం లేకుండానే సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతా నుంచి నేరుగా డబ్బులు తీసుకుని జీరో బ్యాలెన్సు ఉంచింది. దీంతో సర్పంచులు ఆందోళనలకు దిగడంతో కేంద్రం పీఎ్‌ఫఎంఎస్‌ ఖాతాలు తెరచి, వాటిలో ఆర్థిక సంఘం నిధులను జమచేసింది. అయితే తీరు మార్చుకోని గత ప్రభుత్వం అందులోనూ 40శాతం నిధులు విద్యుత్‌ బకాయిలకు చెల్లించాలని కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చింది. ఎంత కట్టారనేది లెక్క లేకపోవడంతో బకాయి భారం తగ్గేలా లేదంటూ సర్పంచులు ఆందోళన చెందారు.

పంచాయతీలు : 697

ఎన్నికలు జరగనివి : 13

నిధులు విడుదల : 684

జనాభా : 1,436,580

టైడ్‌ గ్రాంట్‌ : రూ.17,54,98,705

అన్‌టైడ్‌ గ్రాంట్‌ : రూ.11,69,98,977

ఖర్చు చేసేదిలా..

టైడ్‌ గ్రాంట్‌ : గ్రామాల్లో పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీరు, క్లాప్‌మిత్ర, సిబ్బంది వేతనాలు

అన్‌టైడ్‌ గ్రాంట్‌: సిమెంట్‌ రోడ్లు, కాలువలు, వివిధ అభివృద్ధి పథకాలకు వినియోగం.

Updated Date - Aug 23 , 2024 | 02:26 AM

Advertising
Advertising
<