ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Satyavedu MLA పోలీసులకు తలనొప్పిగా సత్యవేడు ఎమ్మెల్యే కేసు

ABN, Publish Date - Sep 12 , 2024 | 02:32 AM

అటు చూస్తే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నది అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే... ఇటు చూస్తే ఆరోపణలు చేసింది అదే అధికార పార్టీకి చెందిన మహిళా నేత... ఆరోపణలు చేస్తున్నది, ఎదుర్కొంటున్నది ఇరువురూ సమాజంలో అణచివేత ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారే...

అటు దళిత ఎమ్మెల్యే.... ఇటు టీడీపీ మహిళా నేత

హోటల్‌కు రాకపోకలపై ప్రాథమిక ఆధారాలు లభ్యం

ఫోన్‌ కాల్‌ డేటా సేకరణపై దృష్టి

అనివార్యంగా కుట్ర కోణంపైనా దర్యాప్తు

తిరుపతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అటు చూస్తే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నది అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే... ఇటు చూస్తే ఆరోపణలు చేసింది అదే అధికార పార్టీకి చెందిన మహిళా నేత... ఆరోపణలు చేస్తున్నది, ఎదుర్కొంటున్నది ఇరువురూ సమాజంలో అణచివేత ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారే... ఎలా చూసినా సున్నిత వ్యవహారం కావడంతో సత్యవేడు ఎమ్మెల్యేపై నమోదైన కేసు పోలీసు వర్గాలకు తలనొప్పిగా మారింది. దీంతో నిష్పాక్షిక దర్యాప్తుతోనే ఒత్తిడులను అధిగమించాలని, తద్వారా ప్రభుత్వాన్ని ఎవరూ తప్పుపట్టే అవకాశం లేకుండా చేయాలని జిల్లా పోలీసు అధికారులు భావిస్తున్నారు. గత గురువారం అర్థరాత్రి కేవీబీపురం మండలానికి చెందిన ఓ తెలుగు మహిళ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన మహిళే ఈ కేసు విచారణకు సహకరించకపోతుండడం పోలీసు అధికారులకు సమస్యగా మారుతోంది. మరోవైపు ఫిర్యాది, నిందితుడు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందా లేదా అన్నది ఇపుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజానీకంలోనూ చర్చనీయాంశంగా మారుతోంది.

వైద్య పరీక్షలకు, విచారణకు సహకరించని ఫిర్యాది

ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపడిన అంశం కావడంతో తిరుపతి పోలీసులు సత్యవేడు ఎమ్మెల్యేపై నమోదు చేసిన కేసులో దర్యాప్తును వేగంగా మొదలుపెట్టారు. గత గురువారం అర్ధరాత్రి కేసు నమోదు కాగానే శుక్రవారం ఉదయాన్నే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం రుయాస్పత్రికి తరలించారు. అయితే ఆమె వైద్య పరీక్షలకు అంగీకరించకపోవడంతో లిఖితపూర్వకంగా రాయించుకుని పంపివేశారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చట్టప్రకారం వైద్యపరీక్షలు నిర్వహించాల్సి వున్నందున పోలీసులు బాధితురాలి వెంటబడుతున్నారు. ఆ క్రమంలో సోమవారం ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళ వైద్య పరీక్షలు అవసరం లేదని మొండికేసినట్టు సమాచారం. తనను విచారించడం మాని ముందు ఎమ్మెల్యేని అరెస్టు చేసి విచారించాలంటూ ఆమె డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. దీంతో మరోసారి ఆమెతో ఆ మేరకు స్టేట్‌మెంట్‌ రాయించుకుని పంపించేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి వైద్యపరంగా చూస్తే ఈ పరీక్షలతో పెద్దగా తేలేది కూడా ఏమీ వుండదని అటు పోలీసులు, ఇటు వైద్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అత్యాచారం జరిగిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తే పలు ఆధారాలు లభ్యమవుతాయి. దుస్తులపై వీర్యపు ఆనవాళ్ళు, బాధితురాలి దేహంపై ఏవైనా గాయాలు వంటివి వుంటే ఆ మేరకు బలమైన ఆధారాలు లభించేవి. సంబంధిత హోటల్‌ గదిలోని బెడ్డు, బెడ్‌ షీట్‌, టవల్‌ వంటివి కూడా సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాల్సి వుండేది. వాటి ద్వారా కూడా కొన్ని ఆధారాలు దొరికేవి. గత నెల 10వ తేదీన జరిగిన ఘటనపై పాతిక రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. బాధిత మహిళ వైద్య పరీక్షలకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నది పోలీసులకు అంతుబట్టడం లేదు.

మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటాయే కీలకం

కేసును ఎంతోకొంత పరిష్కరించగలిగిన ఆధారాల్లో కీలకమైంది మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటా. దీంతో పోలీసులు ఎమ్మెల్యే ఫోన్‌, బాధిత మహిళ వినియోగిస్తున్న రెండు ఫోన్లు, ఆమె భర్త ఫోన్లకు సంబంధించిన కాల్‌ డేటాపై దృష్టి సారించారు. బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్న జూలై 6, 17 తేదీలతో పాటు ఆగస్టు 10వ తేదీ... ఈ మూడు రోజుల్లో వీరి ఫోన్ల నుంచీ ఎవరెవరికి కాల్స్‌ వెళ్ళాయి? ఎవరెవరి నుంచీ కాల్స్‌ వచ్చాయి? ఎమ్మెల్యే, బాధిత మహిళల్లో ఎవరు ఎన్ని సార్లు ఎదుటి వారికి కాల్‌ చేశారు? అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అదే విధంగా ఆయా తేదీలకు అటూఇటూ పది రోజుల కాల్‌ డేటా కూడా సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు, ఫిర్యాదు వెనుక కుట్ర ఏమైనా వుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు అనివార్యం కానుంది. అందుకే బాధిత మహిళకు, ఆమె భర్తకు ఘటన జరిగిన మూడు రోజులకు ముందు వెనుక రోజుల్లో ఎవరెవరి కాల్స్‌ వచ్చాయి? వీరి నుంచీ ఎవరెవరికి కాల్స్‌ వెళ్ళాయి? అన్నది కూడా విశ్లేషించనున్నారు.

సీసీ ఫుటేజీల సేకరణ

తిరుపతి భీమాస్‌ ప్యారడైజ్‌ హోటల్‌కు ఎమ్మెల్యే పిలుపుపై మూడు సార్లు వెళ్ళినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో తెలిపిన మేరకు ఆ హోటల్‌లో సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరించారు. అయితే హోటల్‌లో సీసీ కెమెరాలు రికార్డు చేసే ఫుటేజీలు స్టోర్‌ అయ్యే హార్డు డిస్కు నుంచీ సంబంధిత రోజువారీ డేటా నెల రోజుల పాటు మాత్రమే వుంటుందని, అటు తర్వాత ఆటోమేటిగ్గా ఎరేజ్‌ అయ్యేలా సెట్టింగ్స్‌ పెట్టడంతో జూలై నెల 6, 17 తేదీల ఫుటేజీలు లభ్యం కాలేదని తెలిసింది. ఆగస్టు 10వ తేదీ ఫుటేజీలు మాత్రం దొరికాయని చెబుతున్నారు. అందులో ముందుగా ఎమ్మెల్యే ఆదిమూలం హోటల్‌కు రావడం, ఆ తర్వాత బాధిత మహిళ రావడం రికార్డయిందని సమాచారం. బాధిత మహిళ హోటల్‌ లోపలికి వెళ్ళాక గది వద్దకు, రిసెప్షన్‌ వద్దకు రెండు సార్లు అటూ ఇటూ తిరిగిన దృశ్యాలు రికార్డయినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సీసీ కెమెరాల హార్డ్‌ డిస్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని విశ్లేషణకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్టు సమాచారం.

సీసీ కెమెరా ఫుటేజీలతో ప్రయోజనం పరిమితమేనా?

దర్యాప్తులో సాంకేతికంగా ఒక దశ వరకూ మాత్రమే ఆధారాలు సేకరించగలమని, అంతకు మించి కేసులోని వ్యక్తుల ఉద్దేశాల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదన్నది పోలీసు అధికారుల భావనగా తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజీలతో దర్యాప్తులో పరిమితంగానే ప్రయోజనం వుంటుంది తప్ప కేసు పరిష్కారానికి పెద్దగా ఉపయోగపడదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాధిత మహిళను ఎమ్మెల్యే బెదిరించిన వీడియోలు కానీ లేదా ఆడియో రికార్డులు కానీ ఇప్పటి వరకూ బాధిత మహిళ పోలీసులకు ఆధారాలు ఇవ్వలేదని సమాచారం. అలాగే అసభ్యకరంగా లేదా బెదిరింపులతో కూడిన వాట్సాప్‌ మెసేజీలు కానీ ఎస్‌ఎంఎ్‌సలు కానీ పెట్టినట్టు కూడా ఆధారాలు అందజేయలేదు.అలాంటి ఆధారాలు వున్నాయో లేదో కూడా బాధిత మహిళ పోలీసులకు వెల్లడించలేదు. అలాంటివి వుంటే ఆరోపణలకు అదనపు బలం కలిగించడంతో పాటు నేర నిరూపణ సులువయ్యేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే, బాధిత మహిళ ఆగస్టు 10న హోటల్‌కు వచ్చినట్టు ఆధారాలు లభించినా నేరాన్ని నిరూపించలేవన్నది వారి భావనగా వుంది. బాధిత మహిళ తనే రికార్డు చేసినట్టుగా చెబుతున్న వీడియోలో ఎమ్మెల్యే బెదిరించడం లేదా దౌర్జన్యంగా వ్యవహరించడం, అత్యాచారం చేసినట్టుగా దృశ్యాలు వుంటే దర్యాప్తు ఒక కొలిక్కి చేరినట్టే. అయితే అలాంటి దృశ్యాలు అందులో వున్నాయో లేదో దర్యాప్తులో తేలాల్సి వుంది. కాగా హోటల్‌లో ఆ మూడు తేదీల్లో గదులు ఎవరు బుక్‌ చేశారు? ఎవరి పేరిట బుక్‌ చేశారు? అన్నది కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఘటన జరిగినట్టు చెబుతున్న తిరుపతి భీమాస్‌ ప్యారడైజ్‌ హోటల్‌ సిబ్బంది సాక్ష్యం కూడా కీలకం కానుంది. పోలీసు విచారణలో వారు వెల్లడించే అంశాలు దర్యాప్తుకు ఉపకరించే అవకాశముంది. బాధిత మహిళ చెబుతున్న తేదీల్లో గదుల్లోకి ముందుగా ఎవరు వెళ్ళారు? ఆయా సందర్భాల్లో బాధిత మహిళ తీరు ఎలా కనిపించింది? గదుల్లో పరిస్థితి అసాధారణంగా అనిపించింది ఏదైనా వుందా? అన్న సమాచారం రిసెప్షన్‌ సిబ్బంది, రూమ్‌ సర్వీస్‌ సిబ్బంది నుంచీ పోలీసులు సేకరించాల్సి వుంది.

ఎమ్మెల్యేని విచారించేది ఎపుడు?

గుండె సంబంధ సమస్యలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే ఆదిమూలం ఎపుడు డిశ్చార్జి అవుతారో తెలియని పరిస్థితి. ఆస్పత్రి నుంచీ డిశ్చార్జి అయితే తప్ప పోలీసులు ఆయన్ను ప్రశ్నించడం వీలు కాదు. అప్పుడు కూడా వైద్యుల సూచనలు కీలకం కానున్నాయి. గుండె సంబంధ సమస్యలు వున్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయద్దని వైద్యులు ఓ గడువు వరకూ సూచించే అవకాశమున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఏమి జరిగితే అది ఏ మలుపు తీసుకుంటుందోనని ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోందని దర్యాప్తు అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే ఆదిమూలానికి మద్దతుగా టీడీపీలోనూ, వెలుపలా కూడా దళిత వర్గాలు ఆందోళన మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్టు చేయాలన్నా స్పీకరు అనుమతి తీసుకోవాల్సి వుంటుందని సమాచారం.అలాగని విచారణను సాగదీయడానికి కూడా వీల్లేని పరిస్థితి. అధికార పార్టీకే చెందిన మహిళా నేత తనపై లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డారని చేసిన ఫిర్యాదు కావడంతో ఆ కోణంలోనూ దీన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. మరోవైపు ప్రభుత్వ, అధికార పార్టీ ప్రతిష్టలతో ముడిపడిన వ్యవహారం. ఈ కారణాలతో సాధ్యమైనంత త్వరగా విచారణ ముగించి వాస్తవాలను బయటపెట్టి తాము ఒత్తిడి నుంచీ బయటపడాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

సత్యవేడులో రాజకీయ నిశ్శబ్దం

ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం వంటి సంచలనాత్మక ఘటనలు జరిగినప్పటికీ నియోజకవర్గంలో రాజకీయంగా మాత్రం నిశ్శబ్దకర వాతావరణమే కనిపిస్తోంది. నియోజకవర్గ టీడీపీలో సైతం దళిత వర్గాలు మినహా మిగిలిన వర్గాలు ఎమ్మెల్యేకు మద్దతుగా ముందుకు రావడంలేదు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగానూ ఎలాంటి కార్యక్రమాలూ జరగకపోవడం గమనార్హం. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, చివరికి విపక్షమైన వైసీపీ వర్గాలు సైతం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా బాధిత మహిళకు కూడా ఎవరూ మద్దతుగా నిలవకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తనపై లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు నేరుగా కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్న ఆయన ఈ మొత్తం ఘటన ఓ హనీ ట్రాప్‌ అని తెలిపారు.

వైద్య పరీక్షలకు ఒప్పుకున్న ఫిర్యాది

ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదుచేసిన తెలుగు మహిళ నాయకురాలు బుధవారం మరోసారి తిరుపతి ఈస్టు పోలీ్‌సస్టేషన్‌కు వచ్చారు.వైద్య పరీక్షలకు ఒప్పుకుని ప్రసూతి ఆస్పత్రిలో జాయినయ్యారు.సోమవారం ఉదయం భర్తతో కలసి స్టేషన్‌కు వచ్చిన ఆమె కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకాలేనని తేల్చి చెప్పారు.దీంతో సీఐ మహేశ్వర్‌రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు.ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వచ్చిన ఆమె వైద్య పరీక్షలను రుయాస్పత్రిలో కాకుండా ప్రసూతి ఆస్పత్రిలో చేయించుకుంటానని సీఐ మహేశ్వరరెడ్డికి చెప్పారు. దీంతో పోలీసుల సహకారంతో ఆమె బుధవారం మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం జాయినయ్యారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆమె వచ్చిందని, సీఐ మహేశ్వరరెడ్డి చెప్పారు.

- తిరుపతి(నేర విభాగం)

Updated Date - Sep 12 , 2024 | 07:10 AM

Advertising
Advertising