ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవి ఫేక్‌ మెయిల్స్‌.. ఆందోళన చెందొద్దు: ఎస్పీ

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:43 AM

తిరుపతిలోని కొన్ని హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్‌ ఫేక్‌వని, దీనికి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు.

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని కొన్ని హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్‌ ఫేక్‌వని, దీనికి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. బాంబు బెదిరింపు మెయిల్స్‌పై ప్రత్యేక సైబర్‌ టీం, ఐటీ కోర్‌ సహా ఇతర విభాగాలతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి భద్రత కూడా పెంచామన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా, అనుమానాస్పద వస్తువులు కనపడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు వచ్చిన అన్ని హోటళ్లు, ఇతర ప్రదేశాల్లోనూ నిరంతరం తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. బెదిరింపు మెయిల్స్‌పై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల సహకారంతో దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నామన్నారు. పటిష్ఠ పోలీసు వ్యవస్థతో తిరుపతి, తిరుమల సేఫ్‌ జోన్‌లో ఉన్నాయన్నారు. కాగా, ప్రశాంత వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలకు ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 31 , 2024 | 06:55 AM