రెండు బార్లకు ఈ టెండర్ల ఆహ్వానం
ABN, Publish Date - Dec 17 , 2024 | 02:10 AM
జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల పరిధిలో రెండుబార్లకు ఈ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు తొమ్మిది నెలల కాలానికి సంబంధించి బార్లు నిర్వహించేందుకు ఆన్‌లైన్ ద్వారా ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 23న పరిశీలించి లాటరీ ద్వారా 24న అర్హులను ఎంపిక చేసి, దుకాణాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల పరిధిలో రెండుబార్లకు ఈ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు తొమ్మిది నెలల కాలానికి సంబంధించి బార్లు నిర్వహించేందుకు ఆన్‌లైన్ ద్వారా ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 23న పరిశీలించి లాటరీ ద్వారా 24న అర్హులను ఎంపిక చేసి, దుకాణాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం గూడూరు ఏఈఎస్ హూహశ్రీని 9440902265, నాయుడుపేట ఎక్సైజ్ సీఐ 9440902516, సూళ్లూరుపేట ఎక్సైజ్ సీఐ 9440902515, తిరుపతి కంట్రోలు రూము ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ 9603274401ను సంప్రదించాలని కోరారు.
Updated Date - Dec 17 , 2024 | 02:10 AM