వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం
ABN, Publish Date - Dec 17 , 2024 | 01:59 AM
పవిత్రమైనఽ ధనుర్మాస ఘడియలు సోమవారం ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని వైష్ణవాలయాల్లో వేంకటేశ్వరస్వామి భక్తురాలు గోదాదేవి (ఆండాళ్) రచించిన 30 పాశురాల తిరుప్పావై పారాయణాన్ని ప్రారంభించారు.చిత్తూరు కోదండరామాలయంలో అర్చకుడు వేణుగోపాల్ బృందం పారాయణం చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చిత్తూరు కల్చరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):పవిత్రమైనఽ ధనుర్మాస ఘడియలు సోమవారం ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని వైష్ణవాలయాల్లో వేంకటేశ్వరస్వామి భక్తురాలు గోదాదేవి (ఆండాళ్) రచించిన 30 పాశురాల తిరుప్పావై పారాయణాన్ని ప్రారంభించారు.చిత్తూరు కోదండరామాలయంలో అర్చకుడు వేణుగోపాల్ బృందం పారాయణం చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మహాలక్ష్మి గోదాదేవి ఆంజనేయ సమేత వేంకటేశ్వరాలయంలో అర్చకుడు తులసీరాం బృందం, పొన్నియమ్మ గుడి వీధి వీరాంజనేయ ఆలయంలో అర్చకుడు సుధాకర్ గురుకుల్, గిరింపేట ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడు కిషోర్, కట్టమంచి వరదరాజ స్వామి ఆలయంలో అర్చకుడు నారాయణ దీక్షితులు తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు. జనవరి 14వ తేదీవరకు రోజుకో పాశురం చొప్పున తిరుప్పావై పారాయణం జరగనుంది.
ఇళ్ల ముందు గొబ్బెమ్మలు
పాలసముద్రం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాసం (పండగ నెల) సోమవారం ప్రారంభమవడంతో మహిళలు తమ ఇళ్ల ముందు రంగవళ్లులు వేసి.. గొబ్బెమ్మలు పెట్టి దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. ఈ నెలంతా గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
Updated Date - Dec 17 , 2024 | 01:59 AM