ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

focus బర్డ్‌పై టీటీడీ దృష్టి

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:08 AM

బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్‌)పై టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు. బుధవారం టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి, మరో జేఈవో, బర్డ్‌ ఇంచార్జి డైరెక్టర్‌ వీరబ్రహ్మం బర్డ్‌ ఆస్పత్రిని సందర్శించారు.

చిన్నారి పేషెంట్‌ తల్లితో మాట్లాడుతున్న టీటీడీ ఈవో శ్యామలరావు

-సందర్శించిన ఈవో, జేఈవోలు

- అంతా బాగుందంటూ వైద్యుల వివరణ

-మరి మీడియాలో కథనాలేంటన్న ఈవో

తిరుపతి, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్‌)పై టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు. బుధవారం టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి, మరో జేఈవో, బర్డ్‌ ఇంచార్జి డైరెక్టర్‌ వీరబ్రహ్మం బర్డ్‌ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి వైద్యులతో సమీక్షించారు. అయితే ‘బర్డ్‌లో అంతా బాగా జరుగుతోంది’ అని వైద్యులు ఈవోను పక్కదారిపట్టించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీంతో ఈవో స్పందిస్తూ ‘ అంతా బాగుంటే మీడియాలో వారానికో కథనం ఎందుకు వస్తోంది’ అని ప్రశ్నించినట్టు సమాచారం. గడిచిన ఐదేళ్లలో బర్డ్‌ ఆస్పత్రి పాలన పక్కదారిపట్టిందని బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘గతి తప్పిన బర్డ్‌’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అదేవిధంగా రెండు వారాల క్రితం బర్డ్‌లో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందన్న నేపథ్యంలో ‘బర్డ్‌ను భ్రష్టుపట్టించారు’ అని మరో కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో, జేఈవోలు బర్డ్‌ను పరిశీలించారు. పత్రికలో వచ్చిన ప్రతి అంశంపై వైద్యులు వివరణ రాసి ఈవోకు అందించినట్టు తెలుస్తోంది. వీటిపై తర్వాత విచారణ చేస్తానని ఈవో చెప్పినట్టు తెలుస్తోంది. బర్డ్‌ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలను, వైద్య సేవలను అడిగి ఈవో తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర వార్డు, జనరల్‌ వార్డు, ఎక్సరే, స్కానింగ్‌, ఓపీ వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఫ ఆపరేషన్లు తగ్గలేదు : టీటీడీ

బర్డ్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు టీటీడీ సీపీఆర్వో రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన ‘గతి తప్పిన బర్డ్‌’ కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. రోగులకు ఓపీ, ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల అమరిక వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత మూడు నెలల్లో 24,429 ఓపీ సేవలు, 1489 ఆర్థోపెడిక్‌ సేవలు అందించారని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారని వెల్లడించారు. కాగా గాయానికి కట్టు మార్చడం, కట్టు కట్టడాలు కూడా ఆపరేషన్ల కిందే చూపించి, ఈవోకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ వినిపిస్తోంది. అదేవిధంగా విజిలెన్స్‌ విచారణ పైన, సిబ్బంది నిర్లక్ష్యంపైన, మెడికల్‌ షాపు మూతపైన ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

Updated Date - Sep 05 , 2024 | 01:08 AM

Advertising
Advertising