ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలాజీ డివిజన్‌ కల ఫలించేనా?

ABN, Publish Date - Nov 03 , 2024 | 02:16 AM

భారత రైల్వేలో గ్రేడ్‌-1 రైల్వేస్టేషన్లలో తిరుపతి ఒకటి. అయితే ఇక్కడ బాలాజీ డివిజన్‌ ఏర్పాటు కలగానే మిగిలింది.

- రద్దీకి అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాలి

- పుణ్యక్షేత్రాల మధ్య ప్యాసింజర్‌ రైళ్లు నడపాలి

- రైల్వే ప్రాజెక్టులపై రేపు పార్లమెంటరీ కమిటీ సమావేశం

తిరుపతి(సెంట్రల్‌) నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత రైల్వేలో గ్రేడ్‌-1 రైల్వేస్టేషన్లలో తిరుపతి ఒకటి. అయితే ఇక్కడ బాలాజీ డివిజన్‌ ఏర్పాటు కలగానే మిగిలింది. తిరుపతి పుణ్యక్షేత్రానికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమీప ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాల్సి ఉంది. అదే సమయంలో స్టేషన్లు అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రయత్నాలు తక్కువగానే జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాల మధ్య మెము ప్యాసింజర్‌ రైళ్లు నడపాలనే డిమాండ్‌ అమలుకు నోచుకోవడం లేదు. సోమవారం తిరుపతిలో రైల్వే ప్రాజెక్టులపై జరగనున్న పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వీటిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చేపట్టాల్సిన పనులివీ..

  • తిరుపతి-రేణిగుంట మధ్య మూడవ రైలు మార్గం ఏర్పాటు చేయాలి.

  • రేణిగుంట జంక్షన్‌ను మరో టెర్మినల్‌ చేయాలి.

  • బాలాజీ డివిజన్‌ ఏర్పాటు చేయాలి.

  • చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలి.

  • సీఆర్‌ఎస్‌ సామర్థ్యం పెంచాలి.

  • తిరుపతి వెస్ట్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలి. ప్యాసింజర్‌ రైళ్లను అక్కడి నుంచే నడిపే విధంగా పనులు చేపట్టాలి.

  • పాకాల జంక్షన్‌కు తగిన ప్రాధాన్యత కల్పించి, అభివృద్ధి పనులు చేపట్టాలి.

Updated Date - Nov 03 , 2024 | 02:16 AM