శ్రీశైలం గేట్లు మూసివేత
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:50 PM
శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం క్రస్టుగేట్లను అధికారులు మూసివేశారు.
శ్రీశైలం, సెప్టెంబరు 11: శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం క్రస్టుగేట్లను అధికారులు మూసివేశారు. జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 1,10,719 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 31,353 క్యూసెక్కులు మొత్తం 1,41,897 వరద వస్తోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి జలాశయానికి 1,47,688 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ జలవిద్యుత కేంద్రం ద్వారా 31,094 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత కేంద్రం ద్వారా 37,116 క్యూసెక్కుల నీటితో విద్యుత ఉత్పత్తి చేస్తున్నారు.
Updated Date - Sep 11 , 2024 | 11:50 PM