ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM CBN Delhi Tour : మీదే బాధ్యత!

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:25 AM

నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.

CM CBN

మోదీజీ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించండి

పోలవరానికి నిధులు మంజూరు చేయండి

అమరావతికి త్వరగా నిధులు ఇప్పించండి

వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు,

పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వండి

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి

కేంద్ర మంత్రులు అమిత్‌ షా,

నిర్మలా సీతారామన్‌, కుమార స్వామితో భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో శనివారం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయన ప్రధానితో గంటకుపైగా చర్చలు జరిపారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మోదీని కలుసుకోవడం ఇది రెండవసారి. తన లక్ష్యం ఏపీని అభివృద్ధి చేయడమేనని, ఇందుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు పదేపదే గుర్తు చేశారు. రానున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవాలని... కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అమరావతి పనులు ప్రారంభించేందుకు విదేశీ సంస్థల నుంచి నిధులు సత్వరం లభించేలా చూడాలని మోదీని కోరారు. పోలవరం పూర్తి చేసేందుకు సత్వర నిధులు మంజూరు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. ఏపీలో మౌలిక సదుపాయాలకు సంబంధించి వివిధ మూలధన ప్రాజెక్టులకు ప్రత్యేక సహాయం అవసరమని అన్నారు. వెనుకబడినప్రాంతాలకు గ్రాంట్లు మంజూరు చేయాలని గుర్తు చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోదీకి చంద్రబాబు తెలిపారు.

అమిత్‌ షాతోనూ భేటీ

మోదీని కలిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానితో చర్చించిన అంశాలను షా వద్ద పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాల్సినఅవసరం ఉందని గుర్తుచేశారు.


అమలు చేయండి...

చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి... ఇటీవల బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి చేసిన ప్రకటనలకు కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రకటనలు ఆచరణలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతికి వివిధ బహుళ జాతి సంస్థల నుంచి నిధులు వేగవంతంగా వచ్చేందుకు తోడ్పడాలని కోరారు. పోలవరం పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను రానున్న కేబినెట్‌ సమావేశాలలోనే విడుదల చేయాలని కోరారు. వివిధ మూలధన ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రత్యేకసాయం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు విడుదల చేసి, రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా అభివృద్ధికి సహకరించాలన్నారు. తర్వాత... కేంద్ర ఉక్కుమంత్రి జేడీ కుమారస్వామితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

నడ్డాతో చర్చలు...

కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అభివృద్ధిలో ఏపీని ఉన్నతస్థానానికి చేర్చడంపై చంద్రబాబు తనతో విలువైన అభిప్రాయాలను పంచుకున్నారని నడ్డా ఎక్స్‌ వేదికగా తెలిపారు. వికసిత్‌ ఆంధ్రా లక్ష్యంగా తమ మధ్య చర్చలు జరిగాయన్నారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయిన సంగతి తెలసిందే. ఈ భేటీలో పోలవరం డయాఫ్రం వాల్‌ ఇతర విభాగాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకోవాలని, కాంట్రాక్టు పనులను పూర్తి చేయాలని కోరారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం సంబంధిత పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారులను కోరారు.

Updated Date - Aug 18 , 2024 | 05:31 AM

Advertising
Advertising
<