ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 07 , 2024 | 05:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు.

Chandrababu Bhuvaneshwari

విజయవాడ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకొని మరీ ఈ చీరలను తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం తీసుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు.


చేనేత ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్‌ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన చీరలను ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రదర్శించనున్నారు. స్టాల్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు.


సుమారు 80కి పైగా స్టాల్స్‌లో చేనేత దుస్తులు ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించినట్లుగా సీఎం తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గుమ్మళ్ల సృజన, పురపాలక కమిషనర్ ధ్యాన చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 05:52 PM

Advertising
Advertising
<