Andhra Pradesh: సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA అథారిటీ సమావేశం..
ABN, Publish Date - Dec 02 , 2024 | 07:31 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అథారిటీ సమావేశం ప్రారంభం అయింది. ఉండవల్లి లోని సీఎం నివాసంలో జరుగుతున్న సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీయే, ఏడీసీ అధికారులు హాజరైయ్యారు.
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అథారిటీ సమావేశం ప్రారంభం అయింది. ఉండవల్లి లోని సీఎం నివాసంలో జరుగుతున్న సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీయే, ఏడీసీ అధికారులు హాజరైయ్యారు. మొత్తం 23 అంశాలు ఎజెండాగా CRDA అథారిటీ సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతిలో కీలకమైన భవన, రోడ్ల నిర్మాణాలు, మౌళిక వసతులు కల్పనకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Dec 02 , 2024 | 07:36 PM