ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అసలు లెక్కలు ఇవే

ABN, Publish Date - Jul 09 , 2024 | 03:37 PM

నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా విద్యుత్‌ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు.

Chandrababu

అమరావతి: నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా విద్యుత్‌ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు.


అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. 2004లో తన పవర్ పోయింది కానీ పవర్ సెక్టార్‌లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందని అన్నారు.


రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం అన్నారు. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు.


అసమర్థుడు కారణంగా రూ.47,741 కోట్లు నష్టపోయాం: చంద్రబాబు

2019-2024 మధ్యకాలంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని అన్నారు. అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని, సోలార్ విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించారని వెల్లడించారు. గత 5 సంవత్సరాల్లో మొత్తం రూ.32,166 కోట్లు ప్రజలపై అదనపు భారం పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. గృహ వినియోగదారులపై రూ.8,180 కోట్ల భారం పడిందని చెప్పారు. ‘‘పెత్తందారులు, పేదవారికి పోటీ అని చెప్పేవాడు. ఈ పెత్తందారీ పాలనలో పేదవాడు ఎలా నలిగిపోయాడో అందరికీ తెలిసింది. చేతకాని పరిపాలన కారణంగా మొత్తం విద్యుత్ సంస్థలు దెబ్బతిన్నాయి. అసమర్థుడు కారణంగా మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయాం. తిక్కలోడు తిరణాల వెళితే ఎక్కను, దిగను సరిపోయిందట. జగన్ పాలన కూడా అలానే ఉంది. పోలవరం పవర్ ప్రాజెక్టు జాప్యం కారణంగా రూ.4,700 కోట్లు నష్టం వచ్చింది. అహంకారం ఉంటే ఇలానే జరుగుతుంది. రాష్ట్రం ఎలా నష్టపోతుంది అనేది తెలిసిపోతుంది’’ అని చంద్రబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి

జులై 16న ఏపీ కేబినెట్ సమావేశం.. ఏం జరుగుతుందో?

ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..

For AP News and Telugu News


పీఎఫ్ ఫండ్ డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించారు: చంద్రబాబు

ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల పీఎఫ్ ఫండ్ డబ్బులు కూడా కొట్టేసే ప్రయత్నం చేశారని, ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ కొట్టేశారని సీఎం చంద్రబాబు అన్నారు. పవర్ సెక్టార్‌లో గ్రోత్ లేకపోవడంతో పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు వెల్లడించారు. ‘‘పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నాం. ఇది చాలా పెద్ద కసరత్తు. నా రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. నేను నాలుగవసారి ముఖ్యమంత్రిని ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడూ ఎదుర్కొనలేదు’’ అని చంద్రబాబు అన్నారు.


ఎక్కడా విద్యుత్ కోతలు ఉండొద్దు

విద్యుత్ కోతలు ఎక్కడా ఉండడానికి వీలులేదని సీఎం చంద్రబాబు అన్నారు. లో ఓల్టేజ్ ఉండకూడదని, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడ పవర్ కట్ ఉండేందుకు వీలులేదని, ఇప్పుడే అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు. ఎక్కడి నుంచి ఫిర్యాదు వచ్చినా వూరుకోబోనని చంద్రబాబు ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Jul 09 , 2024 | 04:19 PM

Advertising
Advertising
<