ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: భారీ వర్షాల వేళ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:08 PM

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నారు. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతోంది.

CM Chandrababu

అమరావతి: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నారు. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కీలక ప్రకటన చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు.


అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తక్షణ సహాయాన్ని అందించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సంసిద్ధంగా ఉన్నారని, వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొ్న్నారు. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు తాను విజయవాడ సింగ్‌నగర్‌లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించానని, అక్కడి నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు, ప్రతి ఒక్కరికీ సాయం అందే వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్‌నే సీఎం కార్యాలయంగా చేసుకుని ఇక్కడ నుంచే పని చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


ఎన్‌బీకే@50కి హాజరు కాలేకపోతున్నా..

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. నందమూరి బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 08:17 PM

Advertising
Advertising