ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Big Breaking: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ఖరారు.. ఎప్పుడంటే?

ABN, Publish Date - Aug 16 , 2024 | 12:47 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైంది. రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (శుక్రవారం) సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Chandrababu Narendra Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైంది. రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (శుక్రవారం) సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు నేటి సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయన సమావేశం కానున్నారు. పోలవరం నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు.


రేపు (శనివారం) సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. గంట తర్వాత అంటే రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారు. అదే విధంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


కాగా ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో అమరావతికి ప్రత్యేక సాయంగా కేంద్రం రూ.15 వేల కోట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రధాని మోదీని చంద్రబాబు కోరనున్నారని తెలుస్తోంది. ఇదిలావుండగా.. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. ఏపీ ఆర్థిక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Updated Date - Aug 16 , 2024 | 02:04 PM

Advertising
Advertising
<