మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP New Cabinet: ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్, లోకేష్‌కు ఏమిచ్చారంటే..?

ABN, Publish Date - Jun 14 , 2024 | 02:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏయే శాఖలు అనేదానిపై ఇంతవరకూ నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేయడం జరిగింది.

AP New Cabinet: ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్, లోకేష్‌కు ఏమిచ్చారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏయే శాఖలు అనేదానిపై ఇంతవరకూ నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్‌లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు.. యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోం మంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్వి్స్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరూ ఊహించని రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు.

  • నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్

  • పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు

  • నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు

  • అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ

  • నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

  • వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ

  • పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

  • సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

  • నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

  • మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

  • ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

  • పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

  • అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

  • కొలుసు పార్థసారథి: హౌసింగ్‌, I &PR శాఖలు

  • డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

  • గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

  • కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

  • గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

  • బీసీ జనార్థన్‌ : రహదారులు, భవనాల శాఖలు

  • టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

  • ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు

  • వాసంశెట్టి సుభాష్‌ : కార్మిక, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌

  • కొండపల్లి శ్రీనివాస్‌ : MSME, సెర్ప్‌, NRI ఎంపర్‌పమెంట్‌ శాఖలు

  • మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడా శాఖలు


Updated Date - Jun 14 , 2024 | 02:45 PM

Advertising
Advertising