ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కురవంక ఆక్రమణలపై కలెక్టర్‌ సీరియస్‌

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:51 PM

మదనపల్లె పట్ట ణంతో పాటు, శివారులోని కుర వంక గ్రామ పంచాయతీలో ప్రవ హిస్తున్న కురవం క ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సీరియస్‌ అయ్యారు.

చెరువులో ఏర్పాటు చేసిన రాళ్లను తొలగిస్తున్న అధికారులు

ఇరిగేషన, రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే

నాలుగు చోట్ల ఆక్రమణల గుర్తింపు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

మదనపల్లె టౌన, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): మదనపల్లె పట్ట ణంతో పాటు, శివారులోని కుర వంక గ్రామ పంచాయతీలో ప్రవ హిస్తున్న కురవం క ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సీరియస్‌ అయ్యారు. దీనిపై వెంట నే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన సంబంధిత అధికారుల ను ఆదేశించారు. గత నెల 19వ తేదిన ‘కుచించుకుపోయిన కురవంక’ శీర్షికన కథనం ప్రచురితమైన విష యం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరికి అందిన ఫిర్యాదులతో కురవంక ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయించి నివేదికలు పంపాలని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వ రూప్‌కు ఈనెల 14న కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సబ్‌కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు జల వనరులశాఖ, రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా కురవంక ఆక్రమణలపై సర్వే నిర్వ హించారు. ఇందులో భాగంగా ఆదివారం పట్టణ శివారులోని కురవంక ఆంజనేయస్వామి ఆల యం నుంచి అధికారులు సంయుక్త సర్వే ప్రారంభించారు. రికార్డుల ప్రకారం కురవంక వెడల్పు ఉన్న నాలుగు చోట్ల పలువురు ఆక్రమించుకోవడంతో పాటు ఇళ్లను నిర్మించడంతో వంక కుచించు కుపోయింది. గట్టిగా వర్షాలు పడి వరదలు వస్తే ఈ ఇళ్లన్నీ వరదనీటిలో మునిగిపోనున్నాయి. అలాగే కురవంక ప్రవహించే దిగువ కురవంక, ప్రశాంతనగర్‌, ఇందిరా నగర్‌ ప్రాంతాల్లో కూడా జలవనరులశాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పట్టణంలో సుమారు 48 చోట్ల కురవంక ఆక్రమణలకు గురైన చోట్ల అధికారులు మార్కిం గ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా కురవంక సచివాలయ సర్వేయర్‌ యశోధ, జలవనరులశాఖ ఏఈ రాయలబాబు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కురవంక నాలుగు చోట్ల ఆక్రమణలకు గురైందని మార్కింగ్‌ చేయడంతో పాటు నివేదికలకు ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

కొత్తచెరువులో ఆక్రమణలు తొలగింపు

కురబలకోట, అక్టోబరు 20: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆపార్టీ నేతలు దౌర్జ న్యాలకు పాల్పడి చెరువును ఆక్రమించు కున్న భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కంటేవారి పల్లె సమీపంలో కొత్త చెరువులో ఆక్రమణ శీర్షిక కథనం ప్రచు రితమైంది. దీనిపై స్పం దించిన అధికారు లు విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు నివేది కను అందజేశారు. దీనికి సంబంధించిన నివేదికను పరిశీలించి భూమి స్వాధీనం చేసుకోవాలని మండల రెవెన్యూ అధికారులను ఆదేశించ డంతో రెవెన్యూ అధికారులు అక్కడిికి చేరుకుని ఆక్రమణకు గురైన భూమిలో ఏర్పాటు చేసిన రాళ్ల కంచెను తొలగించారు.

Updated Date - Oct 20 , 2024 | 11:51 PM