ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector visited : గండికోటను సందర్శించిన కలెక్టర్‌

ABN, Publish Date - Sep 14 , 2024 | 11:09 PM

పర్యాటక ప్రాంతం గండికోటను కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, ఇతర అధికారులు సందర్శించారు. శనివారం గండికోటలో ఓబెరాయ్‌ హోటళ్లకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలను, ఆ ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

అడ్వెంచర్‌ భవనం సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

జమ్మలమడుగు, సెప్టెంబరు 14: పర్యాటక ప్రాంతం గండికోటను కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, ఇతర అధికారులు సందర్శించారు. శనివారం గండికోటలో ఓబెరాయ్‌ హోటళ్లకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలను, ఆ ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడి నుంచి గుర్రపుశాలను, జుమ్మా మసీదు, తదితర ప్రాంతాల్లో సందర్శించారు. అనంతరం సాయంత్రం గండికోట అడ్వెంచర్‌ భవనాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 27న పర్యాటక ఉత్సవాలను పురస్కరించుకుని గండికోటలో అభివృద్ధిపై చర్చించారు. పర్యాటకులకు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పనులు వేగవంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కోట ఎదురుగా స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కొందరు కోరినట్లు తెలుస్తోంది. అయితే సమావేశంలో గండికోట పరిసర ప్రాంతం చుట్టూ అభివృద్ధికోసం పర్యాటకుల కోసం పార్కులు, వాహనాల పార్కింగ్‌, ఎంట్రీ టిక్కెట్లు, గుర్రపుశాల తదితర ప్రాంతాలపై చర్చించారు. గండికోట లోయ పక్కన ఉన్న టెంట్లకు అనుమతులు ఉన్నాయా లేదా అన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనధికారికంగా వేస్తున్న టెంట్లకు, బాడుగ రూములకు పంచాయతీ అభివృద్ధి కోసం కొంత డబ్బు వసూలు చేసి గ్రామం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గండికోట సర్పంచ్‌ గురుఈశ్వర్‌, స్థానిక అధికారులు చర్చించినట్లుగా తెలుస్తోంది.

చుట్టూ రోడ్లు ఏర్పాటు చేయాలని వినతి

నియోజకవర్గంలో ప్రధాన పర్యాటక ప్రాంతం గండికోట. గండికోటకు పర్యాటకులు అనంతపురం, కర్నూలు, హైదరాబాదు, చెన్నై, దూర ప్రాంతాల నుంచి అధికంగా వస్తున్నారు. ఆ విధంగా గండికోటను కనెక్టివిటీ రోడ్లు చుట్టుపక్కల వేయాలని జమ్మలమడుగు ప్రాంత సీనియర్‌ న్యాయవాది మురళీధర్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ ఉప్పలపాడు శ్రీనివాసులరెడ్డి, ఈశ్వర్‌, తదితరులు కలెక్టర్‌ శివశంకర్‌కు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Sep 14 , 2024 | 11:09 PM

Advertising
Advertising