ఇదే చీరలో రాత్రికి రా.. మందు కొడదాం
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:17 AM
ఓ యువతితో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియోకాల్‌లో సరస సంభాషణ సాగించడం కలకలం రేపింది.
మహిళతో గుంటూరు బీజేపీ చీఫ్ నరేంద్ర వీడియోకాల్
గుంటూరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఓ యువతితో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియోకాల్‌లో సరస సంభాషణ సాగించడం కలకలం రేపింది. ‘రేపు రాత్రికి రా....ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను నరేంద్ర కోరడం ఆ వీడియో కాల్‌లో వినిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం బీజేపీ అధిష్ఠానాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ మహిళ బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమెతో నరేంద్ర వీడియోకాల్‌లో మాట్లాడుతూ..‘‘రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్. ఇద్దరం కలిసి మందు కొడదాం’’ అని కోరారు. ఇందులో ట్విస్టు ఏమిటంటే గతంలో అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓ యువతితో జరిపిన సరస సంభాషణల ఫోన్ ఆడియో వార్తల్లోకెక్కి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆ యువతి కూడా ఈమే కావటం గమనార్హం. అప్పట్లో వైసీపీలో ఉన్న ఆమె ఆ సంఘటన తర్వాత బీజేపీలో చేరారు.
Updated Date - Oct 10 , 2024 | 03:17 AM