AP Rains: భారీ వర్షాలు.. అప్రమత్తమైన అనకాపల్లి జిల్లా యంత్రాంగం
ABN, Publish Date - Sep 08 , 2024 | 08:45 PM
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అనకాపల్లి, సెప్టెంబర్ 08: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక
Also Read: Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా మధ్య ఇది తీరం దాటవచ్చని ఐఎండీ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అందులోభాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్‌ను జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఏర్పాటు చేశారు.
Also Read: AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు
Also Read: Kolkata: ఈడీ తనిఖీలు.. రూ. 6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత
అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవిన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం, నర్సీపట్నం కార్యాలయాలలో సైతం కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08924-226599, 08924-222888. రెవెన్యూ డివిజనల్ అధికారి, అనకాపల్లి కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9491998293, రెవెన్యూ డివిజనల్ అధికారి, నర్సీపట్నం కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 7075356563. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ల ద్వారా సహాయం పొందవచ్చునని ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు.
Also Read: Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. బుడమేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో విజయవాడలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు సహయక చర్యలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు. ఈ వరదల కారణంగా.. రాష్ట్రంలో భారీ విపత్తు సంభవించినట్లు అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాతలు సైతం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.. వస్తున్నారు. ఈ విపత్తుపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించిన విషయం విధితమే.
Also Read: Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
Read More National News and Latest Telugu News Click Here
Updated Date - Sep 08 , 2024 | 08:50 PM