ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రాలతో కాదు.. దేశాలతోనూ పోటీ!

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:38 AM

ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

ఏపీని ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

20 లక్షల ఉద్యోగాల కల్పనలో వీటిదే కీలక పాత్ర

ఐసీఈఏ సమావేశంలో మంత్రి లోకేశ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ సెల్యులర్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రతినిధులతో ఆయన సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీని ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, తరచూ వారితో సమావేశమై విధాన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటీ, ఎలక్ర్టానిక్‌ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని, టైలర్‌ మేడ్‌ పాలసీలను రూపొందిస్తామని చెప్పారు.

అంతర్జాతీయ ఏఐ రాజధానిగా విశాఖ

‘‘ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ర్టీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోంది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదంతో ముందుకు సాగుతున్నాం. సరైన ప్రాతిపాదనలతో వచ్చే వారికి తగిన ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీని ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పవర్‌హౌ్‌సగా మార్చడంపై దృష్టి సారించాం. విశాఖను ఐటీ పవర్‌ హౌస్‌గా, అంతర్జాతీయ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని లోకేశ్‌ వివరించారు. తిరుపతిని ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా మార్చడానికి పారిశ్రామికవేత్తల సహకారం కోరుతున్నామన్నారు. ఇప్పటికే ప్రముఖ డిక్సన్‌, డైకిన్‌, టీసీఎల్‌ కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేశాయని అన్నారు. అనంతపురంలో కియా మోటార్స్‌ పనిచేస్తోందని, అనంతపురం, కర్నూలు జిల్లాలను ఆటోమొబైల్‌, ఎలక్ర్టానిక్స్‌, ఈవీ రంగాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. అమెరికాలో వాషింగ్టన్‌ మాదిరిగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దడంపై దృష్టి సారించామన్నారు. భారత్‌లో మొబైల్‌ తయారీ రంగ అభివృద్ధికి గల అవకాశాలు, అందులో పీఎల్‌ఐ పాత్రపై గణాంకాలతో పారిశ్రామికవేత్తలు వివరించారు. అన్నివిధాలా అనువైన వాతావరణంతో వ్యూహాత్మక పెట్టుబడి కేంద్రంగా ఏపీ ముందుకు సాగుతోందని, రాష్ట్రాభివృద్థికి మీ వంతు సహకారం అందించాలని వారికి మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:38 AM