పోతబోలు సంఘమిత్రపై సీఎం పేషికి ఫిర్యాదు
ABN, Publish Date - Oct 08 , 2024 | 11:29 PM
మదన పల్లె మండలం పోతబోలు గ్రామ సం ఘమిత్ర రూ.50లక్షల దాకా అవినీతికి పాల్పడిందని, ఎస్‌హెచజీ గ్రూపు స భ్యులు జమ చేసిన రుణాలను కాజే సిందని గ్రామానికి చెందిన మహిళలు సీఎం పేషికి ఫిర్యాదు చేశారు.
రూ.50లక్షలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు
విచారణ ప్రారంభించిన డీఆర్‌డీఏ అధికారులు
మదనపల్లె టౌన, అక్టోబరు 8: మదన పల్లె మండలం పోతబోలు గ్రామ సం ఘమిత్ర రూ.50లక్షల దాకా అవినీతికి పాల్పడిందని, ఎస్‌హెచజీ గ్రూపు స భ్యులు జమ చేసిన రుణాలను కాజే సిందని గ్రామానికి చెందిన మహిళలు సీఎం పేషికి ఫిర్యాదు చేశారు. అధికా రులను గుప్పెట్లో పెట్టుకుని సంఘ సభ్యురాళ్లను బూతులు తిడుతోందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో మంగ ళవారం రాయచోటి నుంచి డీఆర్‌డీఏ అధికారులు పోతబోలుకు వచ్చి విచారణ ప్రారం భించారు. పోతబోలు గ్రామంలో 35 ఎస్‌హెచజీ గ్రూపుల్లో 350 మంది సభ్యులు ఉండగా వారందరు శ్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్ పథకాల కింద రుణాలు తీసుకుని, ప్రతి నెలా బ్యాంకులో జమ చేస్తున్నారు. కాని ఈ గ్రూపులను అజమాయిషి చేసే సంఘమిత్ర పుణ్య వతి రూ.50లక్షల దాకా సంఘాల సొమ్ము వాడుకుని, రూ.5 వడ్డీకి తిప్పుతోందని గ్రామ స్థులు గత నెల 30వ తేదీన సీఎం పేషికి ఫిర్యాదు చేశారు. సీఎం పేషీ ఆదేశాలతో డీఆర్ డీఏ డీపీఎం లక్ష్మీప్రసాదరెడ్డి నాయకత్వాన నలుగురు అధికారులు మంగళవారం పోతబో లుకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘమిత్ర పుణ్యవతిని అన్ని రికా ర్డులు తీసుకొచ్చి అధికారుల ముందు పెట్టారు. వాటిలో ముఖ్యంగా శ్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్ రుణాలు ఎంత తీసుకున్నారని అధికారులు పరిశీలించగా సుమారు రూ.6 నుంచి రూ.7లక్షల దాకా వ్యత్యాసం ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ సందర్భం గా ఎస్‌హెచజీ సభ్యులు అధికారులతో మాట్లాడుతూ తమను కూడా విచారిస్తే సంఘ మిత్ర పాల్పడిన అవినీతికి ఆధారాలు చూపిస్తామని తెలిపారు. దీనిపై డీపీఎం మా ట్లాడుతూ మరో రెండు రోజుల పాటు విచారణ కొనసాగిస్తామని, ఎస్‌హెచజీ సభ్యులను కూడా విచారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఉదయకుమార్, శ్రీనిధి మేనేజర్ హేమంత, డీఎంజీ మధుబాబు, మదనపల్లె ఏపీఎం సుబ్రమణ్యం పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 11:29 PM