ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రాలయంలో భక్తుల కోలాహలం

ABN, Publish Date - Nov 24 , 2024 | 11:33 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది.

మంత్రాలయం మఠం ప్రాంగాణంలో భక్తుల రద్దీగా ఉన్న దృశ్యం

మంత్రాలయం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం, కార్తీక మాసం కావటంతో దక్షిణాది రాషా్ట్రలైన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర ల నుంచి దాదాపు 80 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అద్దె రూములు దొరకకపోవడంతో మధ్వమార్గ్‌ కారిడార్‌ ముందే భక్తులు చలికివణుకుతూ పిల్లాపాపలతో బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం,బ్‌సస్టాండ్‌ ప్రాంతం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతి పాదదర్శనం కోసం గంటలతరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చెక్క రథంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం నవమి శుభ దినం సందర్భంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పండితులు,అర్చకులు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తిని చెక్క రథంపై ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. అంతక ముందు స్వామి వారికి పాదపూజ చేశారు. పూర్ణభోధపూజ మందిరంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మూలరాములకు బంగారునాణేలతో అభిషేకం చేశారు.

Updated Date - Nov 24 , 2024 | 11:33 PM