ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోస్టల్‌ ఓటుపై గందరగోళం!

ABN, Publish Date - May 05 , 2024 | 04:11 AM

రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టల్‌ ఓటు హక్కుపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు,

ఈ రోజు కాదు.. ఎల్లుండి రావాలన్న అధికారులు

ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లినవారికి చుక్కెదురు

కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో తిప్పలు

8 వరకు ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టల్‌ ఓటు హక్కుపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికార పార్టీ తమకు అనుకూలురైన కొందరు ఎన్నికల అధికారుల సాయంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోకుండా గందరగోళం సృష్టిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఎన్నికల సంఘం పదేపదే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే కొందరు అధికారులు ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవరించారని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు జిల్లా ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 4న ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పీవోలకు పంపిన ఆర్డర్‌ కాపీలో పేర్కొన్నారు. తీరా శనివారం ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లినవారికి చుక్కెదురైంది. ఈ రోజు కాదు... ఎల్లుండి రండి అంటూ అధికారులు చెప్పడంతో వారంతా అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ అభాసుపాలవుతోందని మండిపడుతున్నారు.

హోం ఓటింగ్‌ ఉద్యోగులపై స్పష్టత ఏదీ?

గుంటూరు జిల్లాలో కొందరు ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులను పీవోలుగానూ, ఇతర ఎన్నికల విధుల్లోనూ నియమించారు. వారికి 5, 6 తేదీల్లో రెండో విడత శిక్షణ ఇస్తారు. అదే ట్రైనింగ్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ నియోగం కోసం ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ పీవోలుగా నియమించిన వారిలో 70 మంది వరకు హోం ఓటింగ్‌ బృందంలో ఉన్నారు. ఈ నెల 3 నుంచి 8 వరకు హోం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగులు 5, 6 తేదీల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై స్పష్టత లేదు. ఇతర జిల్లాల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిఉంటే ఈ గందరగోళం ఉండేది కాదంటున్నారు. ఎన్నికల విధుల్లోకి తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీల పరిస్థితి అయోమయంగా మారింది. చాలాచోట్ల వీరికి ఫాం-12 కేటాయించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరెన్ని గందరగోళాలు సృష్టించినా మండుటెండను కూడా లెక్క చేయకుండా పలు జిల్లాల్లో ఉద్యోగులు శనివారం తమకు కేటాయించిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా జిల్లాల్లో 4 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన జిల్లాల్లోనూ ఆదివారం నుంచి మొదలుకానుంది. ఆయా జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 8 వరకు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు స్పష్టతనిచ్చి, ఈ ప్రక్రియను 6వ తేదీ వరకు పొడిగించాలని సీఈవో మీనాను టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు.


పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ప్రత్యేక సెలవు..

ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు ఒక్క రోజు ప్రత్యేక క్యాజువల్‌ సెలవును మంజూరు చేస్తూ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల అక్రమాలపై నిఘా పరిశీలకులు

ఎన్నికల అక్రమాల నివారణకు పరిశీలకులను నియమించినట్లు సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ తెలిపింది. అనంతపురం-ఎస్‌.పి.టక్కర్‌, కర్నూలు-డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి, నెల్లూరు-రామశంకర్‌ నాయక్‌, ప్రకాశం-డి.చక్రపాణి, గుంటూరు-జి.వి.కృష్ణారావు, కృష్ణా -రాజీవ్‌శర్మ, టి.సురేశ్‌బాబు, తూర్పుగోదావరి-స్కందన్‌ కుమార్‌ కృష్ణన్‌, విశాఖపట్నం-దిలీ్‌పసింగ్‌, విజయనగరం-అజయ్‌ మిశ్రా, శ్రీకాకుళం-సి.బి.ఎ్‌స.వెంకటరమణ (రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు), పశ్చిమగోదావరి-ఎ.లక్ష్మి (రిటైర్డ్‌ జిల్లా జడ్జి), కడప-సంతో్‌షమెహ్రా, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. చిత్తూరు-పి.రఘు (రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌).

Updated Date - May 05 , 2024 | 04:11 AM

Advertising
Advertising