ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కార్పొరేట్‌ విద్య.. ఇదేనా జగన్‌..?

ABN, Publish Date - Apr 23 , 2024 | 04:54 AM

‘‘ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. నాడు- నేడుతో అన్ని పాఠశాలలనూ అద్భుతంగా తీర్చిదిద్దాం.

ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ మంది పాస్‌

ప్రైవేటులో 96.72 శాతం.. జడ్పీలో 79.38ు

మొత్తం మార్చేశానని బీరాలు పలికిన సీఎం

ప్రభుత్వ బడులతో కార్పొరేట్‌ పోటీ అని ప్రచారం

టెన్త్‌ ఫలితాలతో బయటపడిన డొల్లతనం

‘‘ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. నాడు- నేడుతో అన్ని పాఠశాలలనూ అద్భుతంగా తీర్చిదిద్దాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇవన్నీ చూస్తే త్వరలో కార్పొరేట్‌ పాఠశాలలే ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. కార్పొరేట్‌ కన్నా ప్రభుత్వ బడులే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటాయి’’.. రెండేళ్ల కిందట ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్‌ పలుకులివి. ఆయన మాటలు కోటలు దాటినా వాస్తవాలను దాగలేదు. సోమవారం విడుదలైన టెన్త్‌ ఫలితాలు చూస్తే... ప్రభుత్వ బడులతో కార్పొరేట్‌ పాఠశాలలు పోటీపడటం అటుంచితే, ఫలితాల్లో కార్పొరేట్‌ దరిదాపుల్లో కూడా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలు కనిపించలేదు. మరి ఈ ఫలితాలు చూశాక కూడా కార్పొరేట్‌ పాఠశాలలు... ప్రభుత్వ బడులతో పోటీపడతాయా?!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాడు- నేడు, ట్యాబ్‌లు అంటూ పైపై మెరుగులు దిద్దిన జగన్‌ ప్రభుత్వం.. విద్యారంగానికి కీలకమైన బోధనా వ్యవహారాన్ని వదిలేసింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించి వారిపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఫలితాల పరంగా ప్రభుత్వ బడులు కార్పొరేట్‌తో పోటీపడలేకపోయాయి. ఈ ఏడాది టెన్త్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనం. తక్కువ మంది విద్యార్థులుండే ఏపీ రెసిడెన్షియల్‌, బీసీ సంక్షేమ మేనేజ్‌మెంట్ల పాఠశాలలు మాత్రం ఉత్తమ ఫలితాలు సాధించాయి. రెండు మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లోనూ 98.43శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు బడుల్లో 96.72 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే, జడ్పీ పాఠశాలల్లో 79.38 శాతం మాత్రమే పాసయ్యారు. ఇక ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ బడుల్లో 74.4 శాతం, మున్సిపల్‌ పాఠశాలల్లో 75.42 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 2803 పాఠశాలల్లో వంద శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో ప్రైవేటు పాఠశాలలు ఏకంగా 1988 ఉన్నాయి. జిల్లా పరిషత్‌ పాఠశాలలు 436, ఆశ్రమ పాఠశాలలు 69, కేజీబీవీలు 75, బీసీ సంక్షేమ పాఠశాలలు 54 ఉన్నాయి.

చివరన తెలుగు సబ్జెక్టు

సబ్జెక్టుల వారీగా చూస్తే జగన్‌ ప్రభుత్వంలో తెలుగుకు చాలా ప్రాధాన్యం తగ్గిపోయింది. భాషా సబ్జెక్టుల్లో తెలుగు కంటే ఇంగ్లీష్‌, హిందీ సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది పాసయ్యారు. తెలుగు సబ్జెక్టులో 96.47 శాతం మంది పాసైతే, హిందీలో 99.24 శాతం, ఇంగ్లీ్‌షలో 98.52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గణితంలో 93.33 శాతం, సైన్స్‌లో 91.29 శాతం, సోషల్‌లో 95.34 శాతం మంది పాసయ్యారు. మీడియం పరంగా చూస్తే తెలుగు మీడియంలో చదివిన వారిలో 71.08 శాతం, ఇంగ్లీష్‌ మీడియంలో చదివినవారు 92.32 శాతం, హిందీ మీడియంలో 100 శాతం, ఉర్దూ మీడియంలో 87.92 శాతం, కన్నడ 56.84 శాతం, తమిళ్‌ 94.62 శాతం, ఒడియా 94.91 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

బోధనేతర పనులతో ప్రభావం

ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఎక్కడైనా తొలుత బోధనకు ప్రాధాన్యమిస్తారు. కానీ జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధన కంటే ఇతరత్రా పనులకు ఎక్కువగా వినియోగించింది. రోజూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ హాజరు, మరుగుదొడ్ల ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం ఫొటోలు, ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం, చిక్కీలు, గుడ్ల లెక్కలు చూసుకోవడం లాంటి బోధనేతర పనులను వారిపై రుద్దింది. దీంతో క్రమంగా బోధనకు సమయం తగ్గిపోయింది. నాడు- నేడు, చిక్కీలు, రాగిజావ అంటూ హడావుడి తప్ప బోధన అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఈ చర్యలతో కీలకమైన బోధనను పక్కనపెట్టి, బోధనేతర పనులతో టీచర్లు సతమతమయ్యారు. ఈ కారణంగానే సర్కారు బడుల్లో ఫలితాలు నిరాశపరిచాయి.

Updated Date - Apr 23 , 2024 | 04:54 AM

Advertising
Advertising