ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

cpm ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:41 PM

వర్షాభావంతో ఖరీ్‌ఫలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.

వేరుశనగ పంటను పరిశీలిస్తున్న రాంభూపాల్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌

రాప్తాడు, సెప్టెంబరు 28: వర్షాభావంతో ఖరీ్‌ఫలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం రాప్తాడు సమీపంలో వర్షాభావంతో ఎండిపోయిన రైతు పామళ్ల కొండప్ప పొలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు కొండప్ప 7 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడన్నారు. వర్షాలు సకాలంలో కురవక దిగుబడి తగ్గి రైతు ఆందోళన చెందుతున్నాడని వివరించారు. అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉందన్నారు. ఖరీ్‌ఫలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆర్థిక సహాయం అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల అధ్యక్షుడు పోతులయ్య, జిల్లా కమిటీ సభ్యుడు రామాంజినేయులు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కదిరప్ప, రైతులు సుబ్బారెడ్డి, వెంకట్రాముడు, పోతులయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:41 PM