సేవా గుణాన్ని అలవర్చుకోవాలి: మంత్రి
ABN, Publish Date - Nov 03 , 2024 | 11:30 PM
తులసి గ్రూప్స్ అధినేత రామచంద్ర ప్రభు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
కర్నూలు కల్చరల్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తులసి గ్రూప్స్ అధినేత రామచంద్ర ప్రభు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. ఆదివారం నగరంలోని రావూరి గారె ్డన్స ఫంక్షన హాలులో ఉమ్మడి జిల్లా స్థాయి పేద బలిజ మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన (రోపా) అధ్యక్షుడు చింతలపల్లి రామకృష్ణ, జనరల్ సెక్రటరీ కోనేటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత, తులసి గ్రూప్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మరొకరికి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన కన్వీనర్ పి. పవనకుమార్, బలిజ సంఘం పెద్దలు కోనేటి చంద్రబాబు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 11:30 PM