ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి నిధులతో కొయ్య బొమ్మల మొక్కల పెంపకం

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:56 AM

ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను రూపొందించే కళాకారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుభవార్త అందించారు.

అంకుడు, తెల్లపొణికి విరివిగా పెంచాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను రూపొందించే కళాకారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుభవార్త అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్లపొణికి కర్ర మొక్కలను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారింది. ఆ చెట్ల మనుగడక్రమంగా క్షీణిస్తుండడంతో ఈ సమస్యను ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల కళాకారులు ఇదివరకే పవన్‌ దృష్టికి తెచ్చారు. ఆయన స్పందించి ఉపాఽధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు, తెల్లపొణికి చెట్లు పెంచాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో, ఏటికొప్పాక, కొండపల్లి పరిసర ప్రాంతాల్లోనూ వాటి పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కృష్ణతేజ చర్యలు తీసుకున్నారు. భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కనీసం రెండు మూడు తరాలకు సరిపడా చెట్లను పెంచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఆయా మొక్కలను ఉపాధి హామీ పథకం నిధులతో పెంచాలని ఉత్తర్వులు జారీచేశారు. హస్త కళలను ప్రోత్సహించే దిశగా ఇప్పటికే పవన్‌ పలు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర అతిఽథులను గౌరవపూర్వకంగా సత్కరించే సందర్భంలో అందించే బహుమతులుగా ఆంధ్రప్రదేశ్‌ కళాకారులు తీర్చిదిద్దిన కళాకృతులనే ఇస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 03:56 AM