ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెగులు సోకిన చైనా వెల్లుల్లి సీజ్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 03:49 AM

చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.

విజయవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఇటీవలి కాలంలో చైనా నుంచి వెల్లుల్లి ఎక్కువగా దిగుమతి అవుతున్న నేపథ్యంలో విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ (ప్రివెంటివ్‌) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను బుధవారం పట్టుకున్నారు. రూ.21.97లక్షల విలువైన 333 బస్తాలు వ్యాన్‌లో ఉన్నట్టు గుర్తించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్లాంట్‌ క్వారంటైన్‌ 2003 ఉత్తర్వుల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం. బిహార్‌లోని జహంజర్‌పూర్‌ నుంచి ఈ సరుకును తమిళనాడులోని కోయంబేడుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఈ వెల్లుల్లి నమూనాలను ప్రయోగశాలకు పంపగా వాటికి ఎంబెల్లిసియా అల్లి (పొడి తెగులు) ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 03:49 AM