ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దెబ్బతిన్న మట్టిమిద్దెలు

ABN, Publish Date - Sep 04 , 2024 | 12:51 AM

మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 22 మట్టిమిద్దెలు దెబ్బతిన్నట్లు మండల తహసీల్దార్‌ ఉమారాణి తెలిపారు.

గువ్వలకుంట్లలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ ఉమారాణి

కొత్తపల్లి, సెప్టెంబరు 3: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 22 మట్టిమిద్దెలు దెబ్బతిన్నట్లు మండల తహసీల్దార్‌ ఉమారాణి తెలిపారు. మంగళవారం తహసీల్దార్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్‌ పెద్దన్న, ఆర్‌ఐ జహంగీర్‌బాషాతో కలిసి మండలంలోని గువ్వలకుంట్లలో వర్షాలకు దెబ్బతిన్న మట్టిమిద్దెలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ దుద్యాల, గువ్వలకుంట్ల, కొక్కెరంచ, గోకవరం, కొత్తపల్లి, శివపురం గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిమిద్దెలు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. ఈ నివేదికను కలెక్టర్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఇంకా మండలంలో ఏ గ్రామంలోనైనా మట్టిమిద్దెలు కూలిపోయినా, దెబ్బతిన్నా వెంటనే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.

వెలుగోడు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెలుగోడు మండలంలో ఐదు మట్టి మిద్దెలు పాక్షికంగా కూలీపోయాయని తహశీల్దార్‌ శ్రీనివాసగౌడ్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వెలుగోడులో రెండు, మోత్కూర్‌లో రెండు, బోయరేవుల గ్రామంలో ఒక్కటి పాక్షికంగా కూలిపోయినట్లు తెలిపారు మట్టి మిద్దెలలో నివాసం ఉన్నవారు వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Sep 04 , 2024 | 07:08 AM

Advertising
Advertising