ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మృతదేహాలే మొదటి గురువులు

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:19 PM

వైద్య విద్యార్థులకు మృతదేహాలే మొదటి గురువలని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కె. చిట్టినర్సమ్మ అన్నారు.

విద్యార్థులతో ప్రమాణం చేయిస్తున్న ప్రిన్సిపాల్‌

వైద్య విద్యార్థులకు కేడావరిక్‌ ఓథ్‌

కర్నూలు హాస్పిటల్‌ 13(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థులకు మృతదేహాలే మొదటి గురువలని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కె. చిట్టినర్సమ్మ అన్నారు. బుధవారం అనాటమీ విభాగంలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ వైద్య విధ్యార్థులకు మృతదేహంపై ప్రమాణం(కేడావరిక్‌ ఓథ్‌)నిర్వహించారు. 250 మంది విద్యార్థులు పాల్గొనే కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శరీరంలో ప్రతి అవయవాన్ని గురించి తెలుసుకోవాలని, మృతదేహాన్ని తప్పక గౌరవించాలని అన్నారు. వైద్య విద్యార్థులు మృతదేహంపై ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని, మానవ శరీరంలోని అంతర్గతంగా ఏఏ భాగాలు ఎక్కడ ఉంటాయి.. ఎలా ఉంటాయో నేరుగా చూడటం జరుగుతుందన్నారు. మరణించినా కూడా వైద్య విద్యార్థులకు పాఠాలు నేర్పుతున్న మృతదేహానికి వారి కుటుంబ సభ్యులను గౌరవించి కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత వైద్యులు, విద్యార్థులపై ఉందన్నారు. అందుకే మొదటి సంవత్సరం విద్యార్థుల చేత కేడావరిక్‌ ఓథ్‌ కింద ప్రమాణం చేయించామని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్స్‌ సాయి సుధీర్‌, హరిచరణ్‌, రుణుకాదేవి, విజయానంద బాబు అనాటమీ హెచఓడీ పి.శోభారాణి, అసోషియెట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:19 PM