Deputy CM Pawan :తెలుగు ఐఏఎస్ పవన్ అభినందనలు
ABN, Publish Date - Jun 16 , 2024 | 05:02 AM
జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
కేరళలో ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృష్ణతేజ్ కృషి
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఆ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తుచేశారు. కరోనా కష్ట కాలంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణ తేజ విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. ఆయన మరింతగా సేవలందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు
Updated Date - Jun 16 , 2024 | 05:02 AM