ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayadashami: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రుల రివ్యూ.. కీలక వివరాలు వెల్లడి

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:09 PM

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ పశ్చిమ ఎంఎల్ఏ సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఈవోతో పాటు సీపీ రాజశేఖరబాబు, మునిసిపల్ కమీషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ పశ్చిమ ఎంఎల్ఏ సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఈవోతో పాటు సీపీ రాజశేఖరబాబు, మునిసిపల్ కమీషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు. దసరా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లోనే దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.


విజయవంతంగా నిర్వహిస్తాం

దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక టైమ్ స్లాట్ఉంటుందని చెప్పారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ వీఐపీల టైమ్ స్లాట్లు ఉంటాయని స్పష్టం చేశారు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దర్శనం టైమ్ స్లాట్ ఉంటుందని వివరించారు.

ఇక రూ.500 టికెట్ తీసుకున్న వారికి కూడా అంతరాలయం వెలుపల నుంచే దర్శనం ఉంటుందని మంత్రి వివరించారు. మొదటి రోజు ఉదయం 9 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 13 శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని, రేపు మధ్యాహ్నానికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని మంత్రి ఆనం వివరించారు. ఉత్సవాలకు ఘాట్ రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని, వీఐపీల కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆ వాహనాల్లోనే వీఐపీలను దర్శనానికి తీసుకువెళ్లి తీసుకొస్తామని అన్నారు. పవిత్ర సంగమం ఘాట్‌లో పవిత్ర హారతులను పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం వివరించారు.


ఇక మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల నిర్వహణకు అన్ని రకాలు ఏర్పాట్లు సిద్ధం చేశారని తెలిపారు. హోల్డింగ్ పాయింట్లు, క్యూలైన్లు అత్యంత సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశారని వివరించారు. వృద్ధులు, వికలాంగుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాటు చేశారని, ప్రజలందరూ అమ్మవారిని దసరా నవరాత్రుల్లో దర్శించుకోవాలని సూచించారు.

Updated Date - Oct 01 , 2024 | 10:09 PM