ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:42 PM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది.

మంత్రాలయం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మఠం అధికారులు క్యూలైన్లు, పరిమళ ప్రసాదం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఫ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథం పై విహరించారు. కార్తీక ఆదివారం పర్వ దినాన్ని పురస్కరించుకుని శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆఽధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాఘవరాయుడికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి స్వర్ణ కవచంతో చూడముచ్చటగా అలంకరించారు. నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయులను అధిష్టించి ఊరేగించారు.

Updated Date - Dec 01 , 2024 | 11:42 PM