ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

pensions : ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:27 AM

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక్క రోజులోనే దాదాపుగా పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు రెండో నెలలో కూడా పింఛన్ల పంపిణీని సమర్థంగా చేపట్టి సామాజిక పెన్షన్‌దారుల మన్ననలు పొందారు.

98 శాతం పూర్తి... 64 లక్షల మందికి 2,737 కోట్లు అందజేత

సచివాలయ ఉద్యోగులతో రెండో నెలలోనూ విజయవంతం

ముఖ్యమంత్రికి మనఃపూర్వక అభినందనలు: పవన్‌

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక్క రోజులోనే దాదాపుగా పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు రెండో నెలలో కూడా పింఛన్ల పంపిణీని సమర్థంగా చేపట్టి సామాజిక పెన్షన్‌దారుల మన్ననలు పొందారు. మొదటి రోజు 98 శాతం పూర్తి చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 64 లక్షల మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.2737 కోట్లు అందించారు. వలంటీర్లు పంపిణీ చేస్తే తప్ప ఈ పంపిణీ సజావుగా సాగదన్న వైసీపీ ప్రభుత్వ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని సచివాలయ ఉద్యోగులు నిరూపించారు. పింఛన్ల పంపిణీపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పించన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశామని అన్నారు. గురువారం ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి అందించేలా సీఎం చంద్రబాబు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైందన్నారు. అందరూ హర్షించేలా పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 04:28 AM

Advertising
Advertising
<