Ambati Rambabu: అంబటి పోటీ చేస్తే ఓడిస్తాం.. అసమ్మతి వర్గం నేతల హెచ్చరిక..
ABN, Publish Date - Jan 15 , 2024 | 04:15 PM
మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో
మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. యర్రం మద్దతు కోరారు. అధిష్ఠానం అదేశిస్తే పోటికి సిద్ధమని యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటును స్థానికులకు ప్రకటించాలన్నారు. సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదు .. అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటిచేస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి రాంబాబు ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు వాపోయారు. అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా మారిపోయారని, అలాంటి మంత్రి తమకు వద్దు అని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
Updated Date - Jan 15 , 2024 | 04:15 PM