ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:07 AM

వినాయకుడి గ్రామోత్సవాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

బాణాసంచా పేలి 30 మందికిపైగా గాయాలు

పలువురి పరిస్థితి విషమం.. దెబ్బతిన్న రెండిళ్లు

నెల్లూరు జిల్లా మనుబోలులో ఘటన

మనుబోలు, సెప్టెంబరు 15: వినాయకుడి గ్రామోత్సవాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గణేశ్‌ మండపం వద్ద అందరూ ఆనందోత్సాహాతలతో ఉన్న తరుణంలో బాణ సంచా పేల్చడం ప్రారంభించారు. ఇలా పేల్చే క్రమంలో జరిగిన తప్పిదంతో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. దీంతో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులోని బీసీ కాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు, కాలనీలో వరసిద్ధి వినాయక ఆలయం ఉంది. ఇక్కడ చవితినాడు భారీ గణేశ్‌ విగ్రహాన్ని నెలకొల్పారు. నవరాత్రులు పూజలుచేసి గ్రామోత్సవానికి సిద్ధం చేశారు. గ్రామోత్సవం కోసం రూ.1.5లక్షల విలువైన టపాసులు తీసుకువచ్చి, ఆలయం పక్కనే ఉన్న ఇంట్లో డంప్‌ చేశారు. ప్రత్యేకంగా బాంబ్‌లు తీసుకురాగా వాటిని కాల్చేందుకు ఇంటిబయట ఖాళీస్థలంలో పెట్టారు. ఔట్‌లు కాలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి బాంబ్‌లపై పడడంతో ఒక్కసారిగా పేలాయి. దీంతోపాటు ఇంట్లో డంప్‌ చేసి ఉన్న మిగతా టపాసులకూ మంటలు వ్యాపించడంతో అవి కూడా పేలాయి. భారీ శబ్దానికి జనం పరుగులు తీయగా, ఇంట్లో ఉన్న తారాజువ్వలు, అవుట్‌లు పక్కఇళ్లలోకి దూసుకెళ్లి పేలాయి. టపాసుల పేలుడు ధాటికి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 30మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరిలో ఏడుగురిని 108లో తిరుపతి జిల్లా గూడూరుకు తరలించగా, మిగతావారు ప్రైవేట్‌ వాహనాల్లో నెల్లూరులోని ఆసుపత్రులకు వెళ్లారు.

Updated Date - Sep 16 , 2024 | 03:10 AM

Advertising
Advertising