ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త తంటాలు

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:31 AM

ఉన్న నాలుకకు మందేస్తే.. అన్న చందంగా జిల్లాల పునర్విభజన, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఇప్పుడు అందరికీ కొత్త అనుభవాలు మిగులుస్తున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగి చాలాకాలం కావొ స్తోంది. అప్పట్లో భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాలపైన జనంతో పాటు స్థానిక ప్రతినిధులు గొంతెత్తారు

జిల్లాల పునర్విభజనలో జనం మాట వినని జగన్‌ ప్రభుత్వం

ఇప్పటికీ వెంటాడుతున్న అనేక సమస్యలు

ఏలూరు కాదు విజయవాడ కావాలంటున్న జనం

రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లోను ఇదే సంక్లిష్టత

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉన్న నాలుకకు మందేస్తే.. అన్న చందంగా జిల్లాల పునర్విభజన, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఇప్పుడు అందరికీ కొత్త అనుభవాలు మిగులుస్తున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగి చాలాకాలం కావొ స్తోంది. అప్పట్లో భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాలపైన జనంతో పాటు స్థానిక ప్రతినిధులు గొంతెత్తారు. కేవలం పార ్లమెంటు నియోజకవర్గాన్ని ఒక కేంద్రంగా మార్చాలనే కోణంలోనే తప్ప ఎదురయ్యే మంచి, చెడులను ఆనాడు అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గడిచిన రెండేళ్లుగా జనం పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా అందరూ సమస్యలను ఏకరువు పెడుతున్నారు.

జిల్లాల విభజనతో ఉమ్మడి జిల్లాల తీరు తెన్నులు ఒక్కసారిగా మారాయి. ఆ స్థానంలో అనేక ఇబ్బందులు, మరెన్నో సమస్యలు చోటు చేసుకున్నాయి. జిల్లాల విభజన పూర్తయ్యి చాలా కాలమైనా సమస్యలు అలానే ఉన్నాయి. జనం చేసిన డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాల విభజనలో ఏలూరు పార్లమెంటు స్థానా న్ని ఏలూరు జిల్లాగా ప్రకటించిన నాటికి ఒక్క సారిగా మార్పు, చేర్పు అనివార్యమైంది. ఉమ్మడి కృష్ణాలోని నూజివీడు, కైకలూరు నియోజక వర్గాలు ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఏలూరులో తాము విలీనం కావడానికి సిద్ధంగా లేమని, తమను కృష్ణా జిల్లాలోనే కొనసాగించా ల్సిందిగా అప్పట్లో నూజివీడు నియోజకవర్గ వాసులు గళం విప్పి సంతకాల ఉద్యమానికి దిగా రు. ప్రభుత్వ విధానం కాబట్టి అప్పట్లో నూజి వీడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మేకా ప్రతాప అప్పారావు నోరు మెదపలేకపోయారు. నియోజక వర్గమంతటా ఈ విషయంలో తమకు ఎదురవు తున్న వ్యతిరేకతను వైసీపీ నేతలు ఆనాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలి తం లేదు. నూజివీడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రం గా ఉండగా ఇది కాస్తా జిల్లాల విభజన అనంత రం విస్తీర్ణంలో పూర్తిగా సగానికి సగం తగ్గింది. విభజన కాకమునుపు నూజివీడు రెవెన్యూ డివి జన్‌ పరిధిలో 14 మండలాలు ఉండగా ఆ తర్వా త ఇప్పుడది కేవలం ఆరు మండలాలకే పరిమిత మైంది. ఆగిరిపల్లి మండలం నుంచి జిల్లా కేంద్రం ఏలూరు చేరుకోవాలంటే 70 కిలోమీటర్లు ప్రయా ణించాలి. నూజివీడును విజయవాడకే పరిమితం చేయాలని, ఆది నుంచి విజయవాడతో తమకున్న సత్సంబంధాలు, సాన్నిహిత్యాన్ని విడదీయ వద్దంటూ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఇదే తరుణం లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. నూజివీడు, అడవి నెక్కలం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లోను అప్పట్లో చంద్రబాబు స్థానికుల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించారు. ‘ఇక్కడివారంతా తమను కృష్ణా జిల్లాలోనే ఉంచాలని గట్టిగానే అడుగుతున్నారు. ఇక్కడివారంతా తమ వ్యవహా రాలన్నీ విజయవాడతోనే ముడిపడి ఉన్నాయం టూ చెప్పుకొస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మీ కల నెరవేరుస్తాం’ మంటూ నూజి వీడు ఎన్నికల సభలో ఆనాడు చంద్రబాబు స్పష్టతతో కూడిన హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనపైనే నూజివీడు వాసు లంతా ఆశలు పెంచుకున్నారు.

డివిజన్‌ కాస్తా చిక్కింది ..

జిల్లాల విభజనతో నూజివీడు రెవెన్యూ డివి జన్‌ పూర్తిగా చిక్కింది. దీనిని సర్దుబాటు చేసేం దుకు ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా అప్పటి జగన్‌ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. నూజివీడు రెవెన్యూ డివిజన్‌ను ఎత్తే యాల్సిన పరిస్థితి నుంచి కాస్తోకూస్తో గట్టేక్కిం చేలా ఈ డివిజన్‌ పరిధిలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలతోపాటు చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాలను విలీనం చేశారు. కాని ఏలూరు డివిజన్‌కు అత్యంత చేరువలో ఉన్న చింతలపూడి, లింగపాలెంలను అటువైపు మళ్ళిం చడాన్ని అప్పట్లో స్థానికులంతా వ్యతిరేకించారు. కాని ప్రభుత్వం పట్టుసడలించకుండా అనుకు న్నదే చేసి చూపించింది. ఇంకోవైపు కైకలూరు నియోజకవర్గ పరిధిలోని ముదినేపల్లి, కలిదిండి మండలాలు ఒకప్పుడు గుడివాడ రెవెన్యూ డివిజన్‌కు కూతవేటు దూరంలో ఉండేవి. ఇప్పు డవి కాస్తా జిల్లాల విభజన తర్వాత దూరంగా ఉన్న ఏలూరు డివిజన్‌లో కలిశాయి. నూజివీడు కు విజయవాడ ఎలాగో ఈ రెండు మండలాలకు గుడివాడ అలాంటిదే. చివరికి చేసేదిలేక అంద రూ సైలెంట్‌ అయ్యారు. ఇప్పటికీ జిల్లా అధికారు లు సుదూరంగా ఉన్న ఆగిరిపల్లి, చాట్రాయి మండలాలను సందర్శించలేకపోతున్నారు. జిల్లా నిడివి పూర్తిగా తగ్గుముఖం పట్టినా కొన్ని శాఖా ధికారులు ఆ వైపు తొంగి చూడలేకపోతున్నారు. కొత్తగా జిల్లాల విభజన అయిన తర్వాత తమకు వచ్చిన లాభం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తుంటే ఇప్పటికీ సమాధానం కరువే.

విముక్తి ఎప్పటికో..

ఒకవైపు అడ్డదిడ్డంగా జరిగిన జిల్లాల విభజన తో జనంతోపాటు అన్ని వర్గాలు విలవిలలాడా యి. కేవలం ఏదో సంస్కరణ చేసినట్టు బిల్డప్‌ ఇచ్చేలా అంత హడావుడి చేసినా ప్రజాప్రయో జనం పెద్దగా లభించలేదు. ఇలాంటి తరుణంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వంపైనే జనం ఆశలు పెంచుకున్నారు. తమ డిమాండ్‌లో కొంతలో కొంతైనా ఈ ప్రభుత్వం నెరవేర్చగలదనే ఆశతోనే ఉన్నారు. కాని సంక్లిష్టంగా మొత్తం ఆరు నియోజక వర్గాలకు గాను మూడింటిలో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో పరిష్కారం అంత సులభమేమీ కాదన్నట్టుగానే కనిపిస్తోందన్న అభిప్రాయాలు లేకపోలేదు.

Updated Date - Dec 03 , 2024 | 12:32 AM