ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ అన్నం మీరు తింటారా?

ABN, Publish Date - Nov 22 , 2024 | 11:44 PM

హాస్టల్‌లో విద్యార్థులకు అందించే ఆహారాన్ని మీరు తింటారా...? అసలు ఈ భోజనం ఒక్కసారైనా రుచి చూశారా...?

ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో వంటలను పరిశీలిస్తున్న డీఈవో

బాతరూముల్లో నీరు లేకపోతే

విద్యార్థులు ఎక్కడకు వెళ్లాలి

కోసిగి హాస్టల్‌ వార్డెనపై డీఈవో ఆగ్రహం

ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ తనిఖీ

కోసిగి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో విద్యార్థులకు అందించే ఆహారాన్ని మీరు తింటారా...? అసలు ఈ భోజనం ఒక్కసారైనా రుచి చూశారా...? హాస్టల్‌లోని బాతరూముల్లో నీరు లేక దుర్వాసన వస్తోంది.. విద్యార్థులకు రోగాలు రావా..? అంటూ జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్‌ పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోసిగి ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ను ఆకస్మికంగా డీఈవో తనిఖీ చేశారు. విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కనీసం ఇంగ్లిషులో చదవడం, రాయడం కూడా రావడం లేదని ట్యూటర్‌ కూడా సమయానికి లేకపోవడంతో వార్డెన కోటేశ్వరరావుపై డీఈవో మండిపడ్డారు. కనీసం హాస్టల్‌ ముందు మెట్లు పగిలిపోయి అధ్వానంగా ఉన్నాయి, బాగు చేసుకోకపోతే ఎలా అని, బాతరూముల్లో నీరు లేక విద్యార్థులు బయటకు వెళ్తున్నారని, ఇంతగా దుర్వాసన వస్తున్నా.. అపరిశుభ్రంగా హాస్టల్‌ను నిర్వహిస్తున్నారని వార్డెనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి భోజనం మెనూ కూడా పాటించకుండా రుచి, శుభ్రత కూడా పాటించకపోవడం సరికాదన్నారు. హాస్టల్‌లోని భోజనం ఒక్కసారైనా మీరు తిన్నారా అని మండిపడ్డారు. కలెక్టర్‌కు నివేదికను అందించి హాస్టల్‌ వార్డెనపై చర్యలు తీసుకుంటామన్నారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు మోయినుద్దీన, శోభారాణి, సీఆర్పీలు అనంతరామ్‌, హుశేనీ, యోహాన, తదితరులున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 11:44 PM