ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లీబిడ్డను బలిగొన్న వైద్యులు

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:36 PM

వైద్యుల నిర్వాకంతో తల్లీబిడ్డలు మృతి చెందారు.

పత్తికొండ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైద్యుల నిర్వాకంతో తల్లీబిడ్డలు మృతి చెందారు. వివరాలు ఇలా.. పత్తికొండ పట్టణం రాజీవ్‌నగర్‌ కాలనీలో నివసిస్తున్న మౌలాలి తన కూతురు మౌనిక (19)ను పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన మహే్‌షకు ఇచ్చి వివాహం జరిపించారు. మౌనిక గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి తీసుకు వచ్చారు. శుక్రవారం ఉదయం నొప్పులు రావడంతో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమెను కాన్పుల వార్డులో చేర్చి సెలైన పెట్టారు. ఆ తర్వాత మౌనికకు నొప్పులు తగ్గిపోవడంతో ప్రసవం ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని, నొప్పులు వచ్చాక రావాలని చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 6గంటలకు నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు మౌనికను మళ్లీ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు ప్రసవం అవుతుందని చెప్పిన సిబ్బంది మధ్యాహ్న సమయంలో గర్భంలో బిడ్డ పరిస్థితి బాగోలేదని, మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో పత్తికొండ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి ఆపరేషన చేశారు. కొద్దిసేపటికే పుట్టిన మగశిశువు మృతి చెందింది. మౌనిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన అంబులెన్సలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వాసుపత్రి డ్యూటీ డాక్టర్‌ వివరణ కోరగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రిలో తమ పర్యవేక్షణలో ఉందని అన్నారు. తాము వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి సిజేరియన చేయించుకుంటామని కుటుంబ సభ్యులే తీసుకెళ్లారని తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 11:36 PM