టీడీపీలోకి డొక్కా..!
ABN, Publish Date - Apr 06 , 2024 | 05:23 PM
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ సైతం వీడేందుకు సిద్దమైనట్లు ఓ చర్చ అయితే జిల్లాలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. స్వయంగా డొక్కా నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.
గుంటూరు, ఏప్రిల్ 06: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ( dokka manikya vara prasad ) సైతం వీడేందుకు సిద్దమైనట్లు ఓ చర్చ అయితే జిల్లాలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) .. స్వయంగా డొక్కా నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఎన్నికల వేళ పార్టీ మారవద్దని.. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా డొక్కాకు అంబటి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.
Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే
కానీ పార్టీ అధిష్టానం నుంచి నేటికి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్కా అలక పూనినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి డొక్కా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది.
కానీ ఆయన ఆ ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ని తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ నియమించారు. అనంతరం గుంటూరు జిల్లాలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న మేకతోటి సుచరితను తప్పించి.. ఆ బాధ్యతలు డొక్కాకు కట్టబెట్టారు.
YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!
అయితే ఇటీవల డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీలో తనకు ప్రాధాన్యత కరువు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అంబటి రాంబాబు.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ నివాసానికి వెళ్లి బుజ్జగించినట్లు సమాచారం. టత్వరలో టీడీపీలో డొక్కా చేరనున్నారని సమాచారం.
మరిన్నీ ఏపీ వార్తలు కోసం..
Updated Date - Apr 06 , 2024 | 05:24 PM