Indrakiladri: భక్తులతో కిక్కిరిసిన కొండ.. ఇంద్రకీలాద్రికి ఒకేరోజు రూ.84.02 లక్షల ఆదాయం
ABN, Publish Date - Oct 14 , 2024 | 08:14 AM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో దీక్షల విరమణ కోసం భక్తులు శని, ఆదివారాల్లో ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దుర్గగుడి పరిసరాలు కిటకిటలాడాయి.
వన్‌టౌన్: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు శుక్రవారం(మహర్నవమి)తో ముగిశాయి. శుక్రవారం మహిషాసురమర్దినీదేవి అలంకారంలో అమ్మ వారు దర్శనం ఇచ్చారు. ఆరోజున కనకదుర్గమ్మ దేవస్థానానికి రూ.84,02,775 ఆదాయం సమకూరింది. 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500, 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100, రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 సమకూరింది. 26,584 లడ్డూలను విక్రయించగా, రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్ లను విక్రయించగా రూ.44,06,600 సమకూరింది. మొత్తం 2,64,396 లడ్డూలను విక్రయించారు.
పరోక్ష ప్రత్యేక కుంకు మార్చన రూ.3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేయగా రూ.54వేలు, పరోక్ష ప్రత్యేక చండీహోమానికి రూ.4వేల టికెట్లను ఏడుగురు కొనుగోలు చేయగా రూ.28వేలు, శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్‌ను ఇద్దరు కొనుగోలు చేయగా రూ.6వేలు ఆదాయం వచ్చింది. పబ్లికేషన్లు, ఫొటో లు, క్యాలెండర్ల ద్వారా రూ.10,230, ఇతరత్రా ఆదాయం రూ.20, 545, రూ.40 టికెట్ ద్వారా 9,536 మంది తలనీలాలు సమర్పించగా రూ.3,81,440 ఆదాయం సమకూరింది
దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: సురేఖ
వన్‌టౌన్: దుర్గమ్మ ఆశీస్సులు ప్రజ లందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని మెగా స్టార్ చిరంజీవి సతీమణి కొణిదల సురేఖ తెలిపారు. శనివారం ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరీదేవి అలంకా రంలో ఉన్న దుర్గమ్మను కుటుంబసభ్యులతో కలిసి ఆమె దర్శించుకున్నారు. దుర్గమ్మను నటుడు పృధ్వీ శని వారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
దుర్గమ్మకు బంగారు హారం
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం నెల్లూ రుకు చెందిన వ్యాపారవేత్త పంకజ్‌రెడ్డి, సరిత దంప తులు రూ.10 లక్షల విలువైన బంగారు హారాన్ని కాను కగా సమర్పించారు. ఈవో రామారావును ద్వారా హారా న్ని దేవస్థానానికి అందజేశారు
అలరించిన కళారూపాలు
పున్నమీఘాట్ ప్రాంతంలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న నారీశక్తి విజయోత్సవాలు రెండో రోజు కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో హాజర య్యారు. శనివారం విజయదశమి సందర్భంగా మహి ళల రాక, వివిధ కళారూపాల ప్రదర్శనతో కృష్ణా తీరం ప్రత్యేక శోభను సంతరించుకుంది. గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యం మహిళలను అలరించింది. తెలంగాణ సంప్రదాయమైన పోతురాజు వేషధారణలో విన్యా సాలు ఆకట్టుకున్నాయి.
MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్
For Latest News and National News click here
Updated Date - Oct 14 , 2024 | 09:55 AM