AP Elections2024: వైసీపీ అభ్యర్థికి ఎవరూ ఊహించని పరిస్థితి.. పోటీకి దిగిన భార్య
ABN, Publish Date - Apr 18 , 2024 | 07:49 PM
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. భర్తపైనే భార్య పోటీకి దిగుతుండడం జిల్లాలో సంచలనంగా మారింది.
శ్రీకాకుళం, ఏప్రిల్ 18: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. భర్తపైనే భార్య పోటీకి దిగుతుండడం జిల్లాలో సంచలనంగా మారింది. టెక్కిలి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Sriniva)కు ఆ పార్టీ అగ్రనాయకత్వం కేటాయించింది.
దీంతో ఆయన తన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. అయితే మరోవైపు ఆయన భార్య దువ్వాడ వాణీ (Duvvada Vani) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నెల 22న ఆమె... తన నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే ఆమె తన వర్గంతో చర్చించినట్లు సమాచారం.
AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ
గతంలో దువ్వాడ శ్రీను అభ్యర్థిత్వాన్ని అతడి భార్య వాణి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పంచాయతీ కాస్తా పార్టీ అధినేత వైయస్ జగన్ వద్దకు చేరింది. దాంతో దువ్వాడ శ్రీనును పక్కన పెట్టి.. నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు దువ్వాడ వాణికి సీఎం జగన్ కట్టబెట్టారు.
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మళ్లీ దువ్వాడ శ్రీనివాస్‌ను నియమించారు. ఆ క్రమంలో టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించారు. ఈ నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వంపై దువ్వాడ వాణి అలకబూనినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆమె నిర్ణయించారని సమాచారం. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గం వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
AP Elections: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?
గత కొంత కాలంగా దువ్వాడ శ్రీనివాస్‌కు అతడి భార్య వాణి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తన భర్తను తప్పించాలని పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌ను ఆమె కోరారు. ఆ క్రమంలో ఆయన్ని తప్పించి.. ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించారు.
కానీ ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌కే ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. దాంతో కొంత కాలంగా వైసీపీ వ్యవహారాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. అయితే టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ వాణి.. ఓ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. గతంలో ఆ వర్గంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. అటు భార్య, ఇటు భర్త వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
MK Meena: సీఎస్, ఇంటెలిజెన్స్ డీజీపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం
అయితే గతంలో పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు దువ్వాడ వాణికి కట్టబెట్టిన సమయంలో... సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఆమె బరిలో దిగుతారని స్పష్టం చేశారు. కానీ అనంతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ శ్రీనివాస్‌కు కేటాయించారు. దాంతో దువ్వాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అందుకోసం తన వర్గంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రపదేశ్ వార్తలు కోసం..
Updated Date - Apr 18 , 2024 | 10:31 PM