రాష్ట్ర స్థాయి పద్యగాన పోటీలు.. 25లోగా పేర్లు నమోదు చేసుకోవాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 01:00 AM
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆరేళ్ల నుంచి 20ఏళ్లలోపు వయసు వారికి పద్యగాన పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరి తెలిపారు.
అమలాపురంటౌన్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆరేళ్ల నుంచి 20ఏళ్లలోపు వయసు వారికి పద్యగాన పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు ఒక పద్యాన్ని రాగయుక్తంగా పాడిన వీడియోను, పేరు, వయసు, తరగతి, ఊరు, ఫోన్ నంబరుతో సహా డాక్టర్ కొల్లూరి, 9247272066కు వాట్సాప్ ద్వారా ఈనెల25వ తేదీలోగా పంపించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. 6నుంచి 10ఏళ్ల వారికి ప్రహ్లాద విభాగం, 11నుంచి 15ఏళ్ల వారికి మార్కండేయ విభాగం, 16నుంచి 20ఏళ్ల వరకు వివేకానంద విభాగంగా పోటీలు జరుగుతాయి. ప్రాథమిక పరిశీలనలో ఒక్కో విభాగం నుంచి 30మంది చొప్పున 90మందిని ఎంపిక చేసి వారి పేర్లను నవంబరు 30న ప్రకటిస్తామన్నారు. ప్రాథమిక స్థాయిలో అర్హత పొందిన 90మంది డిసెంబరు 9న గుంటూరులో నిర్వహించే కార్యక్రమంలో నేరుగా పాల్గొని ఒక్కొక్కరు మూడు పద్యాల చొప్పున గానం చేయాలని వీరికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారన్నారు. విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని కొల్లూరి తెలిపారు.
Updated Date - Nov 14 , 2024 | 01:00 AM