జిల్లాలో 282 గ్రామాల్లో పశుగణన
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:58 AM
జిల్లాలో ఉన్న పాడిరైతులు, పశువుల సమాచారం కోసం పశుగణన చేపడుతున్నామని జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి డాక్టర్ ఓ.వెంకట్రావు తెలిపారు.
అంబాజీపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న పాడిరైతులు, పశువుల సమాచారం కోసం పశుగణన చేపడుతున్నామని జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి డాక్టర్ ఓ.వెంకట్రావు తెలిపారు. గంగలకుర్రులో జరుగుతున్న పశుగణన కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో 426గ్రామాలుండగా 282గ్రామాల్లో పశుగణన సర్వేకు సిబ్బందిని నియమించామన్నారు. ప్రతి ఇంటి వద్ద గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలు, కోళ్లు, బాతులు ఇతర జంతువల సమచారాన్ని పూర్తిస్థాయిలో సేకరిస్తామన్నారు.2019పశుగణన ప్రకారం 4.93లక్షల నివాస గృహాలు ఉన్నాయన్నారు. పశుగణన పూర్తయిన నివాసానికి గుమ్మం కుడివైపు భాగంలో సర్వే సిబ్బంది స్టిక్కర్‌ను అతికిస్తారన్నారు. ఈపశుగణన ఆధారంగా అవసరమైన వారికి చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సహకాలు, దాణ, పచ్చిమేతకు అవసరమైన వాటిని గుర్తించి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. పెంపుడు, వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై అంచనా వేయవచ్చన్నారు. సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయసాయిరెడ్డి, మండల పశువైద్యాధికారి డి.రాజేంద్రప్రసాద్, పశువైద్య సహాయకులు ఉన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 12:58 AM