ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాపురానికి రానివ్వకుండా వేధింపులు

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:38 AM

రావులపాలెం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న తరుణంలో అత్తింటివారు కాపురానికి రానివ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. యు వతి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకకు చెందిన గండ్రోతు హరికృష్ణ, యామన ఝాన్సీ 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొమరాజులంకలో దీక్ష చేపట్టిన బాధితురాలు

భర్త ఇంటి ముందు మహిళ నిరసన దీక్ష

రావులపాలెం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న తరుణంలో అత్తింటివారు కాపురానికి రానివ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. యు వతి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకకు చెందిన గండ్రోతు హరికృష్ణ, యామన ఝాన్సీ 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అత్తారింటికి వెళ్లగా అత్త గండ్రోతు వెంకటలక్ష్మి, మావయ్య సత్తిపండులు ఝాన్సీ మెడలో తాళి తెంపి మీది వేరే కులం, మాది వేరే కులం నువ్వు కాపురానికి ఎలా వస్తావంటూ కొట్టి దు ర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి చెందిన బాధితురాలు ఆత్మహత్యయాత్నానికి పాల్పడింది. ఆమెను స్థానిక ప్రవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. కాగా కాపురానికి తీసుకుని వెళ్లాలని ఎన్నిసార్లు వేడుకున్నా, పెద్ద మనుషులతో మాట్లాడించినా ఎటు వంటి స్పందన లేకపోవడంతో ఝాన్సీ తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం భర్త గండ్రోతు హరికృష్ణ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని పేర్కొంది. బాధితురాలికి అం డగా పలువురు మహిళలు చేరుకుని ఝాన్సీని కాపురానికి తీసు కుని వెళ్లాలంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ చంటి సిబ్బందితో అక్క డికి వెళ్లి వారితో చర్చించారు. తనకు న్యాయం జరగాలని శాంతియుతంగా దీక్ష చేస్తున్నానని న్యాయం జరిగే వరకూ కొనసాగిస్తానని ఝాన్సీ తెలిపింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా ఎస్‌ఐ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం

బాధితురాలకు అన్ని విధాలా న్యాయం జరిగే వరకూ అండగా నిలబడి పోరాడతామని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా వీరబాబుగౌడ్‌ అన్నారు. బాధితురాలి దీక్ష వద్దకు ఆయన చేరుకని అండగా నిలబడ్డారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గండ్రోతు హరికృష్ణ ఝాన్సీని పెళ్లి చేసుకుని కాపురానికి తీసుసుకెళ్లకపోవడం దారుణమన్నారు. అత్తమామలు ఆమెపై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ దృష్టికీ విషయాన్ని తీసుకుని న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 12:38 AM