ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

4న అచీవ్‌మెంట్‌ సర్వే

ABN, Publish Date - Nov 23 , 2024 | 12:29 AM

విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను గుర్తించేందుకు చేపట్టిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (నాస్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీంబాషా సూచించారు. డిసెంబరు 4వ తేదీన పబ్లిక్‌ పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

అమలాపురం టౌన్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను గుర్తించేందుకు చేపట్టిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (నాస్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీంబాషా సూచించారు. డిసెంబరు 4వ తేదీన పబ్లిక్‌ పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అమలాపురం జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నాస్‌ సర్వే నిర్వహించేందుకు నియమించిన విద్యార్థులకు ఓరియంటేషన్‌ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లను ఉద్దేశించి డీఈవో సలీంబాషా మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకునే వీలవుతుందన్నారు. డీసీఈబీ కార్యదర్శి బి.హనుమంతరావు, సమగ్రశిక్ష ఏఎంవో పి.రాంబాబు మాట్లాడుతూ నాస్‌ సర్వేలో భాగంగా జిల్లాలో 104 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఆయా పాఠశాలల నుంచి 3, 6, 9 తరగతులను విద్యార్థులకు నాస్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. అధికారులు విద్యార్థులను సమన్వయం చేసుకని నాస్‌ పరీక్షను విజయవంతం చేయాలన్నారు. జిల్లాస్థాయి మాస్టర్‌ ట్రైనర్లు సురేష్‌, జాన్‌బాబులు ఫీల్డు ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు.

Updated Date - Nov 23 , 2024 | 12:29 AM