Home » Kona Seema
సెజ్‌లో నెలకొల్పిన లైఫిజ్ రసాయన కంపెనీ సముద్రంలోకి ఏర్పాటుచేసిన పైప్‌లైన్‌ను తొల గించాలని, మత్స్యకారుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట గ్రామానికి చెం దిన మత్స్యకారులు గురువారం ఆర్అండ్బీ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీల్లో 76 సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను గుర్తించేందుకు చేపట్టిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా సూచించారు. డిసెంబరు 4వ తేదీన పబ్లిక్ పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విష సర్పాలు పల్లె వాసులను కలవరపెడుతున్నాయి. ఈ విష సర్పాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సు ఫీజులు భారీగా పెరగడంతో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు బెల్టు షాపులకు తెరతీశారు. దుకాణాలు లేని చోట ముఖ్య కూడళ్లకు సమీపంలోను, గ్రామాల్లోను బెల్ట్‌షాపులను ఏర్పాటు చేయించారు.
నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.
సఖినేటిపల్లి లంక గ్రామంలో అద్భుతం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
సంక్రాంతి ఉత్సవాల్లో పలు జిల్లాల్లో కోడి పందేల పోలీసుల సాక్షిగా జోరుగా హుషారుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు జాతరలా తరలివస్తూనే ఉన్నారు. మెజారిటీ బరులు వైసీపీ నేతల అండతో ఏర్పాటు కావడంతో ఎలాంటి ఆంక్షలూ ఆటంకాల్లేకుండా పందేలు జరుగుతున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.