ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషి

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:05 AM

దివాన్‌చెరువు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వ్యాయామ విద్య అధ్యాపకులంతా సమష్టిగా పనిచేసి గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషిచేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ వర్శిటీ విద్య కళాశాల ఆధ్వర్యంలో రెండు రో

చాంపియన్‌షిప్‌ ట్రోఫీ అందుకుంటున్న రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల జట్టు

నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు

ముగిసిన అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కం విశ్వవిద్యాలయ జట్టు పోటీలు

దివాన్‌చెరువు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వ్యాయామ విద్య అధ్యాపకులంతా సమష్టిగా పనిచేసి గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషిచేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ వర్శిటీ విద్య కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కం విశ్వవిద్యాలయ జట్టు పోటీలు శనివారం ముగిశాయి. 24 ఈవెంట్స్‌లో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కళాశాల స్థాయి క్రీడా క్యాలెండర్‌ను తయారు చేసి దానికి తగ్గట్టుగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పతకాలను, ట్రోఫీలను అందజేశారు. అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. మహిళా ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫీని భీమవరంలోని డీఎన్‌ఆర్‌ కళాశాల కైవసం చేసుకుంది. విశ్వవిద్యాలయం ఫాస్టెస్ట్‌ మహిళా రన్నర్‌గా గోపన్నపాలెంలోని ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ కళాశాలకు చెందిన వి.జయశ్రీ, పురుషుల రన్నర్‌గా గొల్లలమామిడాడలోని డీఆర్‌కే రెడ్డి కళాశాలకు చెందిన రాంబాబు ట్రోఫీలను అందుకోగా వీసీ అభినందించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, కార్యనిర్వాహక చైర్మన్‌ కొండ్రు సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శి సీహెచ్‌వీ సుబ్రహ్మణ్యం, పీడీలు ప్రమీలారాణి, సాల్మన్‌ దేవానంద్‌, బాలసత్యనారాయణ, రామ్‌గోపాల్‌, ఫణీంద్ర, మూర్తి, రత్నబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 01:05 AM