ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదివాసీల అభ్యున్నతికి కృషి

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:48 PM

ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

అమలాపురం టౌన్‌, ఆగస్టు 9: ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో నాగరికత ముసుగులో ఆదివాసీలు ఉనికిని కోల్పోతున్నా వాటిని కాపాడుకునేందుకు మూలవాసీలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారన్నారు. ప్రతీ ఏటా ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. మారుమూల గిరిజన మండలాల్లో ప్రభుత్వం విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచిందన్నారు. గిరిజన తెగలు, జనజీవన స్రవంతిలో మంచిగా జీవనాన్ని సాగించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ నకిలీ గిరిజన ధ్రువపత్రాలను నిర్మూలించాలని, పందుల పెంపకానికి స్థలాలు కేటాయించాలని, సామాజిక భవనాలు నిర్మించాలని కోరారు. ఎస్టీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘ నాయకులు ఉప్పు శ్రీనివాస్‌, మానుపాటి గోవిందరావు, బండారు గోవిందు, బండారు సత్యనారాయణను కలెక్టర్‌ సత్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో జి.కేశవర్ధనరెడ్డి, వికాస జిల్లా మేనేజరు గోళ్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 11:48 PM

Advertising
Advertising
<