ఎక్స్‌ప్రెస్‌లను అనుమతించాలి
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:21 AM
కొవ్వూరు పట్టణంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగక, ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు రాకపోవడంతో ప్రజలు దూర ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి పెనుమాక జయరాజు అన్నారు. కొవ్వూరు పట్టణంలోకి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆర్డీవో రాణి సుశ్మితకు ఫిర్యాదుచేశారు.
టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి జయరాజు
కొవ్వూరు టౌన్‌లోకి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల రాకపై ఆర్డీవోకు వినతి
కొవ్వూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొవ్వూరు పట్టణంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగక, ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు రాకపోవడంతో ప్రజలు దూర ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి పెనుమాక జయరాజు అన్నారు. కొవ్వూరు పట్టణంలోకి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆర్డీవో రాణి సుశ్మితకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు కం రైలు బ్రిడ్జి భద్రత పేరుతో ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించక పోవడంతో పట్టణ ప్రజలు దూర ప్రయాణాలకు వెళ్లాలంటే తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారన్నారు. విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, హైటెక్ బస్సులు కొవ్వూరులోకి రాకుండా గామన్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం వెళ్లిపోతున్నాయని, దీంతోప్రయాణికులు టోల్‌గేట్ వద్ద దిగి టౌన్‌లోకి రావడానికి అధికమొత్తం చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారన్నారు. రాత్రుళ్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, విద్యార్థినులు గామన్ వంతెన అండర్ టన్నెల్ వద్ద బస్సు ఎక్కడానికి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వంతెన నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులను పట్టణంలోకి అనుమతించాలని కోరారు. దీనిపై ఆర్డీవో స్పందిస్తూ త్వరలో జరగనున్న డివిజనల్ సమావేశంలో అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వినతిపత్రం అందించిన వారిలో సూరపనేని సోమయ్య తదితరులు ఉన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 3 ఫిర్యాదులు
కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించి, 3 ఫిర్యాదులు స్వీకరించినట్టు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 01:21 AM